News

ఆ రోజున రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు

KJ Staff
KJ Staff

రైతుల కోసం ఏపీ ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.7500 ఆర్థిక సహాయం చేస్తోంది. మూడు విడతల చొప్పున వీటిని నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను త్వరలో రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది.

మే 13న రైతు ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. రూ.4 వేలను రైతుల ఖాతాల్లో వేయనున్నారు. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోనివారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 30వ తేదీలోపు అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ నెల 30లోగా అప్లై చేసుకున్నవారికి కూడా వచ్చే నెలలో డబ్బులు పడనున్నాయి. దీంతో ఇప్పటికీ ఈ పథకానికి అప్లై చేసుకోనివారు వెంటనే అప్లై చేసుకోవడం మంచిది.

అప్లై చేసుకోవడం ఎలా..

-వాలంటీర్ దగ్గర అప్లికేషన్ ఫారం తీసుకుని అందులోని వివరాలు పూర్తి చేయాలి
-బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ జిరాక్స్ లు ఇవ్వాలి

మీరు అర్హులో.. కాదో తెలుసుకోవడం ఎలా..

-రైతు భరోసా అధికారిక వెబ్ పైట్ కి వెళ్లండి
-ఆ తర్వాత రైతు భరోసా స్టేటస్ మీద క్లిక్ చేయండి
-అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి
-అప్పుడు మీ పేరు అర్హుల జాబితాలో ఉందో.. లేదో తెలుస్తుంది

Share your comments

Subscribe Magazine