రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 3వ తేదీ నుండి మొదలయిన పదవ తరగతి పరీక్షల్లో , మొదటి రోజే తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయి వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. కానీ రెండవ రోజు హిందీ ప్రశ్నపత్రం కూడా అదేవిధంగా లీక్ అవ్వడంతో ఈ వార్త రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.
తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ గురించి విచారించగా వెల్లడయింది ఏమిటంటే, పరీక్ష మొదలయిన వెంటనే , వికారాబాద్ జిల్లా లోని
తుండూరు-1 పాఠశాలలో 5 వ నెంబర్ పరీక్ష హాలు నుండి ఇన్విజిలేటర్ ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో మరో టీచర్ కు పంపాడు అక్కడ నుండి వాట్సాప్ గ్రూపు ల ద్వారా అవి రాష్ట్రమంతా వ్యాపించాయి. దీనిని అనుసరించి నిన్న జరిగింది పేపర్ లీకేజి కాదనీ , మాల్ప్రాక్టీసు ప్రయత్నమని ఉన్నత అధికారులు వెల్లడించారు.ఇన్విజిలేటర్ పాల్పడిన చర్యను అధికారులు, మిగతా ఉపాధ్యాయులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఇది కుడా చదవండి ..
లంచం అడిగిన అధికారి కార్యాలయం ముందు డబ్బులు వెదజల్లిన సర్పంచ్
ఈ ఘటనపై చర్చలు జరుగుతున్న క్రమం లో తాజాగా ఈరోజు పరీక్షలో హింది ప్రశ్నపత్రం కూడా లీక్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది . వరంగల్ జిల్లాలో సుమారు 9. 30 గంటలకు పేపర్ బయటకు వచ్చినట్లు చెప్తున్నారు . కానీ, పరీక్షకు ముందే పేపర్ బయటకు వచ్చిందా లేదా మొదలయ్యాక లీక్ అయిందా అన్న విషయం పై ఇంకా విచారణ జరుగుతుంది. ఇలా వరుస క్రమం లో పేపర్ లీక్ జరగడంతో విధ్యార్తిలు , తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు తగిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆందోళన చేసారు.
ఇది కుడా చదవండి ..
లంచం అడిగిన అధికారి కార్యాలయం ముందు డబ్బులు వెదజల్లిన సర్పంచ్
Share your comments