News

లంచం అడిగిన అధికారి కార్యాలయం ముందు డబ్బులు వెదజల్లిన సర్పంచ్

Srikanth B
Srikanth B

లంచం .. లంచం .. ప్రభుత్వ ఉద్యగం అంటేనే లంచం .. లంచం తీసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు ప్రభుత్వ అధికారులు .. లంచం తమ హక్కుగా , లంచం తీసుకోకుండా ప్రభుత్వం అప్పగించిన పని చేయాలంటే కొందరు అధికారులకు పుణ్యానికి చేస్తున్నట్లు ఫీలవుతుంటారు .. ఇక్కడ అలంటి ఘటననే జరిగింది .

మహారాష్ట్రలోని శంబాజీనగర్‌ జిల్లా పులంబ్రీ పంచాయతీ సమితి పరిధిలోని గోవరాయ్‌ పయాగ్‌ గ్రామ సర్పంచ్ పేరు మంగేష్ సాబడే.అతను తన గ్రామంలో నీటి సమస్య ఉండడంతో తమ గ్రామానికి బావులు మంజూరు చేయాలనీ ప్రభుత్వానికి ఆర్జీ నపెట్టుకున్నాడు తన ఆర్జీ ను ఆమోదించిన ప్రభుత్వం గ్రామానికి బావులు మంజూరు చేసింది , అయితే ఆ బావులు తవ్వుకునే పనులు ప్రారంభించాలంటే స్థానిక అధికారుల అనుమతి ఇవ్వాలి. దీంతో సర్పంచ్ మంగేష్‌ బీడీవో (బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌) కలిసి అనుమతి ఇవ్వాలని కోరాడు. దీనికి సదరు అధికారి మంజూరు అయిన దాంట్లో దాదాపు 12 శాతం తనకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

మాగ్రామంలో రైతులు పేదవారు..అంత డబ్బు ఇచ్చుకోరని దయచేసిన అనుమతి ఇవ్వాలని విన్నవించుకున్నాడు. కానీ సరదు అధికారి డబ్బు ఇస్తేనే సంతకం చేస్తానని లేదంటే మంజూరు అయిన బావులు క్యాన్సిల్ అయిపోతాయని బెదరించాడు.దీంతో సదరు సర్పంచ్ కు కోపం వచ్చింది. ఇటువంటి అధికారులు బుద్ధి చెప్పాల్సిందనని నిర్ణయించుకున్నాడు.రూ.100, రూ.500 నోట్లతో ఓ దండ తయారు చేయించి దాన్ని మెడలో వేసుకుని కార్యాలయం రోడ్డుపై నిలబడి డబ్బులను వెదజల్లాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పై అధికారులకు సమాచారం అందింది , దీనితో వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేసారు .

పత్తి రైతులకు హెచ్చరిక: పత్తి నిల్వతో బాధ పడుతున్న రైతులు..


కొన్ని సార్లు ప్రభుత్వాలు మంచి పథకాలు తెస్తున్న .. ఎలాంటి అధికారుల్లా వాళ్ళ లబ్దిదారులకు మేలు జరగడం లేదని .. వెదజల్లిన ప్రతి రూపాయి రైతుల కష్టార్జితం అని .. అధికారిని సస్పెండ్ చేయడం తో పాటు రైతులు నష్ట పోయిన డబ్బులను తిరిగి అతని వద్దనే వసూలు చేసి రైతులకు ఇవ్వాలని ఆ సర్పంచ్ డిమాండ్ చేసారు .

పత్తి రైతులకు హెచ్చరిక: పత్తి నిల్వతో బాధ పడుతున్న రైతులు..

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine