ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒకటి అయిన తిరుమల తిరుపతి వెంకటేశ్వరా స్వామి లడ్డు లో కల్తీ జరిగిందన్న క్రమమంలో టీటీడీ బోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుపతి 'లడ్డూ ప్రసాదం' క్వాలిటీ ను పునరుద్దరించినట్లు శుక్రవారం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రసిద్ధ తిరుపతి 'లడ్డూ ప్రసాదం'లో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై భక్తులు ఆందోళనల చెందవద్దని తెలిపింది.
''శ్రీవారి లడ్డూ సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రసాదం . భక్తులందరూ సంతృప్తి చెందేలా లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కట్టుబడి ఉంది’’ అని ఆలయ బోర్డు ఆ పోస్ట్‌లో పేర్కొంది.
రెండు రోజుల క్రితం ఆంధ్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. అదే క్రమంలో నాణ్యత కోసం పరీక్షించిన శాంపిల్స్‌లో నాణ్యత లేని నెయ్యి మరియు పందికొవ్వు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్స్ లో వెల్లడితం అయినది.
ఈ అంశంపై గత వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దీన్ని 'డైవర్షన్ పాలిటిక్స్'గా అభివర్ణించారు.
Share your comments