31 పైసలు బకాయి ఉన్న రైతు రుణ బకాయి సర్టిఫికేట్‌ను నిలిపివేసినందుకు గుజరాత్ హైకోర్టు బుధవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ శివారుల్లో రైతు శ్యాంజీ భాయ్. ఆయన తన పేరు మీద ఉన్న కొంత భూమిని రాకేశ్, మనోజ్ అనే వ్యక్తులకు అమ్మాడు . భూమిని అమ్మడానికి ముందు ఈ భూమిపై శ్యాంజీభాయ్ రూ.3 లక్షల రుణం తీసుకున్నాడు. భూమిని అమ్మిన కొన్ని రోజుల తర్వాత తాను బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును చెల్లించేశాడు. భూమిని కొన్న వ్యక్తులు రెవెన్యూ రికార్డుల్లో తమ పేరును నమోదు చేసుకోవటానికి ప్రయత్నించగా
రుణానికి సంబంధించి బ్యాంకు ఇవ్వాల్సిన నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. పరిష్కారానికై కాకపోవటంతో భూమిని కొన్న యజమానులు రెండేళ్ల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
శ్యాంజీ భాయ్. తీసుకున్న పంట రుణం తిరిగి చెల్లించిన తర్వాత ఇంకా 31 పైసలు బకాయి ఉందని అందుకే నో డ్యూస్ సర్టిఫికేట్ జారీ చేయలేదని బ్యాంకు కోర్టుకు తెలిపింది.ఇంత తక్కువ మొత్తానికి ముఖ్యమైన డాక్యుమెంట్‌లను నిలిపివేయడం, వేధింపు తప్ప మరేమీ కాదు అని న్యాయమూర్తి బ్యాంక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం యాభై సైసల కంటే తక్కువగా ఉన్న రుణాన్ని నిబంధనలోకి తీసుకోరాదని ఉందని విచారణ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు.స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జాతీయ బ్యాంకు అయినప్పటికీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
న్యాయమూర్తి తదుపరి విచారణను మే 02కి వాయిదా వేశారు మరియు ఈ విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని బ్యాంకును కోరారు.
అయితే కేవలం 31 పైసలకి అతి ముఖ్యమైన డాక్యూమెంట్లను నిలిపివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి.
మరిన్ని చదవండి.
Share your comments