దక్షిణ సూడాన్‌లో ఒక విచిత్రమైన కేసులో గొర్రె ఒక మహిళను చంపినందుకు దోషిగా మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది.
వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజంగా జరిగింది. సాధారణంగా ఒక హత్య జరిగితే పోలీస్ కేసు, కోర్టుల చుట్టూ తిరిగాకే సరైన విచారణ తరువాత నిందుతులకి శిక్ష పడుతుంది.కానీ ఇక్కడ జరిగింది చూస్తే బాధ పడాలో నవ్వాలో తెలియని అయోమయ పరిస్థితి.దక్షిణ సూడాన్‌లో రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో రామ్ అని పిలవబడే గొర్రె 45 ఏళ్ల అదీయు చాపింగ్‌పై దాడి చేసింది.
ఈ గొర్రె పదే పదే తలతో కొట్టి, ఆమె పక్కటెముకలు విరిచింది,మహిళపై దాడి చేసి ఛాతీపై చాలాసార్లు కొట్టినట్లు సమాచారం. ఆమె గాయాల కారణంగా వెంటనే మరణించింది.ఈ ఘటన ఈ నెల ప్రారంభంలో జరిగినట్లు సమాచారం. అయితే అదీయు పై దాడి చేసిన గొర్రెను దక్షిణ సూడాన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని కస్టమరీ కోర్టులో ప్రోడ్యూస్ చేశారు.
విచారణ అనంతరం కోర్టు గొర్రె కి మూడేళ్లు జైలు శిక్ష విధిచింది.అంతే కాకుండా రామ్ యజమాని డుయోని మాన్యాంగ్ ధాల్ బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులను కూడా అప్పగించాలని స్థానిక కోర్టు తీర్పునిచ్చింది.
అయితే గొర్రె యజమాని రామ్‌ను కోల్పోయే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ ప్రాంతంలోని ఆచార చట్టాలు ఒక వ్యక్తిని చంపే ఏదైనా పెంపుడు జంతువు బాధితుడి కుటుంబానికి పరిహారంగా ఇవ్వబడుతుంది. ఈ మేరకు సాక్షులుగా వ్యవహరిస్తున్న పోలీసులు, ప్రజాసంఘాల నాయకుల సమక్షంలో ఇరు కుటుంబాల వర్గాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
మరిన్ని చదవండి.
Share your comments