రోజు రోజుకు పెరుగుతున్న గ్యాస్ సీలిండర్ ధరలతో అటు సామాన్యుడు ఇటు మధ్య తరగతి కుటుంబాల జేబులు ఖాళీ అవుతున్నాయి , ఇప్పటికి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలకు రోజు రోజు పెరుగుతున్న గ్యాస్ ధరలు మరింత భారంగా మారుతున్నాయి ఇదే క్రమంలో గ్యాస్ తో అవసరం లేకుండా సోలార్ స్టవ్ త్వరలో అందుబాటులోకి రానున్నది .
‘సూర్య నూతన్’.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తయారు చేసిన రెండు బర్నర్ల సోలార్ స్టవ్. ఇటీవల జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2023లో దీనికి ప్రధాని ఆమోద ముద్ర కూడా పడింది .. త్వరలోనే 30 మిలియన్ల హౌస్‌హోల్డ్స్‌కు ఈ స్టవ్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. దేశంలో పెరుగుతున్న చమురు ధరలకు ప్రత్యామ్న్యాయంగా సోలార్ స్టవ్ ఉపయోగపడనుంది ఈ సోలార్ స్టవ్‌ని మీ వంటగదిలో సులభంగా ఉపయోగించవచ్చు. స్టవ్ ప్రాధమిక బేసిక్ మోడల్ రూ.12 వేలకు, టాప్ మోడల్ రూ. 23 వేలుగా ఉంది ఈ స్టవ్ రెండు యూనిట్స్ అమర్చబడి ఉంటాయి ఒకటి బయట మరొకటి వంటగదిలో బయట వుండే సోలార్ ప్యానల్ ద్వారా ఎనర్జీ ఉత్పత్తి అవుతే వంట గదిలో ఉండే స్టవ్ పైన వంట చేసుకునే వెసులుబాటును కల్గి ఉంటుంది .
Good news :ఉచితంగా ఆధార్ అప్డేట్ చేయండి ఇలా !
ప్రస్తుతానికి ధర పరంగా అధికంగానే ఉన్నపటికీ రానున్న కాలంలో వీటి ధర తగ్గే అవకాశం వున్నది , పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బంది పడొద్దు అనుకునే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ క్రింద ఈ సోలార్ స్టవ్ ను తీసుకోవచ్చు . మరోవైపు ‘సూర్య నూతన్’ సోలార్ స్టవ్ హైబ్రిడ్ మోడ్‌లో పనిచేస్తుంది. అంటే సౌరశక్తితో పాటు ఇతర విద్యుత్ వనరులను కూడా ఈ స్టవ్‌లో ఉపయోగించుకోవచ్చు.
Share your comments