News

Good news :ఉచితంగా ఆధార్ అప్డేట్ చేయండి ఇలా !

Srikanth B
Srikanth B
Aadhaar card update now free of cost
Aadhaar card update now free of cost

భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఈ ఆధార్ కార్డు లేనిదే మనకి ఈ పని జరగదు. మనం ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్నా, దానికి ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలీ. కేంద్ర ప్రభుత్వం మనకు ఈ ఆధార్ కార్డులను యూఐడిఏఐ ద్వారా జారీ చేస్తుంది. అయితే ఆధార్ కార్డుల అప్డేట్ ఇప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకుండా అప్డేట్ చేసుకోవచ్చు .

ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో 15 మార్చి 2023 నుండి 14 జూన్ 2023 వరకు అప్‌డేట్ చేసుకోవచ్చు.అయితే ఈ అవకాశం కేవలం ఆన్లైన్ ద్వారా స్వయంగా చేసుకున్న వారికే బయటి ఆన్లైన్ సెంటర్ లలో చేయించు కుంటే మాత్రం డబ్బులను చెల్లించాలి , గతంలో దీనిపై రూ . 50 రూపాయలు కనీస చార్జీలను వసులు చేసింది ఇప్పుడు ఆ 50 రూపాయలు కూడా చెల్లించకుండా ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు .


ఆన్లైన్ ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకోండి ఇలా :
. https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్‌కి వెళ్లి,
'ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

15 రోజులలో ముగియనున్న పాన్ -ఆధార్ లింకింగ్ గడువు !

ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP ఉపయోగించి లాగిన్ చేయండి.

'ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్'పై క్లిక్ చేయండి.

12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, 'Send OTP'పై క్లిక్ చేయండి.

OTPని నమోదు చేసి, ఆధార్ ఖాతాకు లాగిన్ చేయండి.

‘అప్ డేట్ వయా అడ్రస్ ప్రూఫ్’ ఎంపికను ఎంచుకున్న తర్వాత కొత్త చిరునామాను పూరించండి.

'ప్రూఫ్ ఆఫ్ అడ్రస్'లో పేర్కొన్న నివాస చిరునామాను నమోదు చేయండి.

ఇప్పుడు, అడ్రస్ ప్రూఫ్‌గా ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.

చిరునామా రుజువు స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేసి, ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.

15 రోజులలో ముగియనున్న పాన్ -ఆధార్ లింకింగ్ గడువు !

Related Topics

Aadhaar card

Share your comments

Subscribe Magazine