ఒక వైపు ఆన్‌లైన్ గేమ్ మరోవేపు ఆన్‌లైన్ లోన్ లు యువత జీవితాన్ని చిదిమేస్తున్నాయి , కొందరు ఆన్‌లైన్ యాపు లు అందించే లోన్ తీసుకొని ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంటే ,.. మరికొందరు ఆన్‌లైన్ గేమ్ అంటు తల్లి తండ్రులు కష్టపడి సంపాదించినా సొమ్మును కాస్త ఆన్‌లైన్ గేమ్ మాయలో కోల్పోతున్నారు ., అటువంటి ఒక ఘటన హైదరాబాద్ సమీపం లోని శంషాబాద్ లో జరిగింది వివరాలలోకి వెళితే
ఆన్‌లైన్ గేమ్ కింగ్ క్యాసినో ఆడి ఓ డిగ్రీ విద్యార్థి రూ. 92లక్షలు పోగొట్టుకున్నాడు. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన చన్‌వెళ్లి శ్రీనివా్‌సరెడ్డి, విజయలక్ష్మీల చిన్న కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు , వీరి కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని అమ్మగా రూ. 85లక్షలు వచ్చాయి.
దాంతో వారు శంషాబాద్ మండలం మల్లాపూర్ గ్రామంలో అర ఎకరం భూమిని కొనేందుకు రూ.70లక్షలకు మాట్లాడుకుని అడ్వాన్సుగా రూ.20లక్షలు చెల్లించారు. మిగతా రూ. 50లక్షలను వారికి చెల్లించాలని చెప్పి తండ్రి ఖాతా నుంచి చిన్న కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్తికి భారీ డిమాండ్ .. ఇక్కడి రైతులకు లభించేది 7 నుంచి 8 వేలు ..
అంతేకాకుండా గ్రామంలో తెలిసిన ఓ వ్యక్తి దగ్గర రూ. 10లక్షలు అప్పు చేసి తన ఖాతాలో జమ చేసుకున్నాడు. వాటితో వారం రోజుల క్రితం ఆన్‌లైన్ గేమ్ కింగ్ క్యాసినో ఆడి రూ. 92లక్షలు పొగొట్టుకున్నాడు. కొనుగోలు చేసిన భూమికి మిగతా రూ. 50లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని తల్లిదండ్రులు హర్షవర్ధన్‌రెడ్డిని అడగగా అసలు నిజం తెలిపాడు , దీనితో కంగుతిన్నా తల్లిదండ్రులకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరస్థులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని హర్షవర్ధన్‌రెడ్డి కుటుంబసభ్యులు పోలీసులను వేడుకున్నారు.
Share your comments