News

అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్తికి భారీ డిమాండ్ .. ఇక్కడి రైతులకు లభించేది 7 నుంచి 8 వేలు ..

Srikanth B
Srikanth B

 

మార్కెట్లలో ప్రత్తి ధర గత కొన్ని సంవత్సరాలుగా 6 వేల నుంచి 8 వెల వరకు మాత్రమే కొనసాగుతుంది .. ఈ ఏడాది ప్రారంభంలో 10 వేల వరకు ధర పలికిన ప్రత్తి ఇప్పుడు కొన్ని మార్కెట్లలో అయితే రూ . 6900 నుంచి గరిష్టముగా రూ . 8000 వేలు వరకు ధర పలుకుతుంది .ప్రారంభంలోరూ . 10000 వేలు పలుకుతుండడంతో రైతులు అధిక మొత్తంలో పంటను మార్కెతుకు తరలించారు . ఇదే అదునుగా భావించిన దళారులు ధరను తగ్గించి రైతులను నష్ట పోయేలా చేస్తున్నారు .

ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తముగా దాదాపు 50 లక్షల ఎకరాలలో ప్రత్తి సాగు అయినది .. అయిన దిగుబడి మాత్రం ఆశించిన స్థాయిలో లేదు ఎకరానికి 15 నుంచి 18 క్వింటాలు దిగుబడి ఆశించగా 7 నుంచి 8 క్వింటాలు మాత్రమే వచ్చిందని రైతులు వాపోతున్నారు . ఒక వైపు దిగుబడి తగ్గిందని రైతులు బాధపడుతుంటే మరో వైపు ధరలు తగ్గించి రైతు వెన్ను విరుస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు .

యాసంగిలో ప్రయోగాత్మకంగా 200 ఎకరాలలో ప్రత్తి సాగు ..

అంతర్జాతీయ మార్కెట్లో ఒక బెల్ ధర 63 వేలు పలుకుతుంది ,ఒక బెల్ లో 165 కిలోల ప్రత్తి దూది ఉంటుంది . ఒక క్వింటా లో 34 కిలోల దూది లభిస్తుంది అంటే దాదాపు 5 క్వింటాలు ప్రత్తి ఒక బెల్ కు సమానం అంటే ఏవిధముగా నైనా రైతులకు చెల్లించేది 40 వేలు .. వ్యాపారులకు 20 వేల వరకు లాభం .. అంతర్జాతీయ మార్కెట్లో అధిక లాభాలను ఆర్జిస్తూ రైతులకు మాత్రం సరైన ధర అందించడం లేదనేది వాస్తవం . ధర విషయాన్ని ప్రక్కకు పెడితే రైతుకు తరుగు అని నాణ్యత లేదని కోతలు విధిస్తు మరింతగా నష్ట పోయేలా చూస్తున్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం వ్యాపారాలు సిండికేట్ గ మరి ధరలను తగ్గించడాన్ని నియంత్రించాలని .. రైతులకు సరైన ధర అందించే విధముగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు .

యాసంగిలో ప్రయోగాత్మకంగా 200 ఎకరాలలో ప్రత్తి సాగు ..

Share your comments

Subscribe Magazine