News

దక్షిణ మధ్య రైల్వే ఖాతాలో మరో కీలక రికార్డ్.......

KJ Staff
KJ Staff

భారత దేశంలోని అన్ని రైల్వే జోన్లకన్నా ముందుండే దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మరొక్క కీలక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దేశంలోని అన్ని రైల్వే జోన్ల కన్నా అత్యుతమ ప్రతిభ కనబరుస్తూ సరుకు రవాణా ద్వారా అత్యంత ఎక్కువ ఆదాయాన్ని సొంతం చేసుకుంది.

ఎప్పటిలాగానే దక్షిణ మధ్య రైల్వే మిగిలిన రైల్వే జోన్లతో పోలిస్తే ఎక్కువ ప్రతిభ చూపించింది. గడిచిన ఆర్ధిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా ఘణనీయమైన ఆదాయంపొంది మరొక్క రికార్డు సృష్టించింది. పోయిన ఆర్ధిక సంవత్సరంలో 141.117 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. 2022-2023 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే సరుకు రవాణా 8.7 శాతం పెరిగింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు ఉన్నాయి. రైల్వే టిక్కెట్ల ద్వారా సరుకు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది మొత్తం ఆదాయం 13,438 కోట్లు. ఇది గత ఏడాది ఆదాయం కన్నా రూ. 506 కోట్లు ఎక్కువ. ఈ రైల్వే పరిధిలో అత్యధికంగా బొగ్గు(70.52 మెట్రిక్ టన్నులు), సిమెంట్ (36.17 మెట్రిక్ టన్నులుగా ) ఉంది.

ఈ రైల్వే జోన్ ప్రారంభించిన సంవత్సరం నుండి అధిక ఆదాయం తెచ్చిపెడుతుంది. ప్రయాణ టిక్కెట్ల నుండి, మరియు సరుకు రవాణా నుండి మిగిలిన అన్ని జోన్ల కన్నా ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణించే రైల్వే లైన్ లో ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాం దీనికి ప్రధాన కారణం. అంతే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే జోన్ నుండే బొగ్గు సరఫరా జరుగుతుంది.సింగరేణి నుండి బొగ్గు ఈ రైల్వే పరిధిలోనే జరుగుతుంది కనుక బొగ్గు రవాణాలో అత్యధిక స్థానాన్ని సంపాదించుకుంది. సరుకు రవాణా సేవలను మరింత మెరుగుపరచడానికి సింగల్ లైన్ గా ఉన్న ఈ మార్గాన్ని డబల్ లైన్ మార్చేందుకు పనులు ప్రారంభమయ్యాయి. దీని ఫలితంగా సిమెంట్ ఫ్యాక్టరీలు, మరియు ఇతర ఉత్పత్తి కర్మాగారాల నుండి సరుకు రవాణా పెరిగి భవిష్యత్తులో మరింత ఎక్కువ ఆదాయం ఆర్జించవచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine