తెలంగాణలో రుతుపవనాలు సోమవారం వచ్చాయని, రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ,హైదరాబాద్ తెలిపింది. పూర్తి వివరాలు చదవండి.
తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించి, మహబూబ్‌నగర్ జిల్లా వరకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ తెలిపింది.ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, రాజన్ననగర్, సిరిసిల్ల జిల్లాలతో పాటు జిల్లాలకు ఎల్లో అలర్ట్ లేదా 'బీ అలెర్ట్' హెచ్చరిక జారీ చేశారు.
అంతే కాకుండా జూన్ 14 నుంచి 17 మధ్య హైదరాబాద్‌లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆదివారం నాడున్న మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.మరో రెండు రోజుల్లో తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ,హైదరాబాద్ పత్రికా ప్రకటనలో తెలిపింది.
సోమవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా. రాష్ట్రంలో మంగళ, బుధ చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని జిల్లాల్లో రాగల మూడ్రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశమున్నట్లు తెలిపింది. గంటకు 30నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే 48గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది. కాబట్టి రైతు సోదరులు తదనుగుణంగా చర్యలు తీసుకోగలరు.
మరిన్ని చదవండి.
Share your comments