Agripedia

రైతులకు శుభవార్త ఇకపై నేరుగా మొబైల్ ఫోన్లకే ఆ వివరాలు!

S Vinay
S Vinay

భారతీయ వాతావరణ శాఖ (IMD) రైతులకు ఉచితంగా మెసేజ్ (SMS) ద్వారా ప్రాంతీయ భాషలలో వాతావరణ సూచనలను అందించే దిశగా ప్రణాళిక చేస్తోంది.

దేశంలో ఎక్కడి నుండైనా రైతులకు ప్రత్యేక నంబర్‌ను డయల్ చేయడం ద్వారా వారి గ్రామం లో రాబోయే ఐదు రోజులలో వర్షాలు, ఉష్ణోగ్రత, తేమ మరియు గాలి వేగం వంటి వాతావరణ సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు.వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, భారత వాతావరణ శాఖ (IMD) ఈ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.

రైతులు చేసిన అభ్యర్థనలను IMDలోని ప్రత్యేక బృందం ప్రాసెస్ చేస్తుంది ఆ తర్వాత SMS ద్వారా సంబంధిత ప్రాంతీయ భాషలో వారికి సమాచారం ఇవ్వబడుతుంది.ఈ సేవని పూర్తిగా ఉచితంగా అందించనున్నారు.దీని కొరకై ఎలాంటి ఛార్జెస్ ఉండబోవు.అతి త్వరలోనే హెల్ప్ లైన్ నంబర్ జారీ చేయనున్నారు.

ప్రాంతీయ స్థాయిలో వాతావరణ సంబంధిత సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం వల్ల రైతులు తమ రోజు వారి వ్యవసాయ క్షేత్రంలో చేపట్టాల్సిన కార్యకలాపాలపై సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది.ఈ సేవలను అందుకోవడానికి ఎలాంటి స్మార్ట్ ఫోన్ అవసరం లేదు.

వర్షాలు, ఉష్ణోగ్రత, తేమ మరియు గాలి వేగంపై సమాచారాన్ని రూపొందించడానికి భారత వాతావరణ శాఖ , జిల్లా స్థాయిలో దాదాపు 200 వ్యవసాయ-ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ కృషి మౌసమ్ సేవ కింద, వాతావరణ శాఖ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ICAR అనుబంధ సంస్థల సహకారంతో జిల్లా స్థాయి వాతావరణ సూచనలను వారానికి రెండుసార్లు అందిస్తోంది. ఐదు రోజుల జిల్లా స్థాయి వాతావరణ సూచనలో వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం దాని దిశ, వాతావరణంలో తేమ శాతం వంటి సమాచారం ఉంటుంది.

మరిన్ని చదవండి.

వాయు కాలుష్యం తగ్గితే పంట దిగుబడి 28% వరకు పెరుగుతుంది!

భారతీయ రైతులు జపనీస్ సాగు విధానాలను చేపట్టాలి!

ఐదు అంచెల పద్దతిలో సాగు విధానం!

Share your comments

Subscribe Magazine