News

జూన్ రెండో వారంలోగ నైరుతి రుతుపవనాలు..

Srikanth B
Srikanth B
జూన్ రెండో వారంలోగ నైరుతి రుతుపవనాలు..
జూన్ రెండో వారంలోగ నైరుతి రుతుపవనాలు..

రాష్ట్రంలో జనాలు తీవ్ర ఎండా ధాటికి బయటకు రావాలంటే భయపడుతున్నారు ,ఈ ఎండలు ఎప్పుడు తగ్గి వర్షాకాలం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు అలాంటి వారికీ వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల ఎప్పుడు ప్రవేశయించనున్నాయి అనే బులిటెన్ ను విడుదల చేసింది .. వాతావరణ శాఖ విడుదల చేసిన ఈ బుల్లెటిన్ ప్రకారం నైరుతి రుతుపవనాలు కేరళా లోకి జూన్ 4 వ తేదీన ప్రవేశించనున్నట్లు వెల్లడించింది .

 

జూన్ 4 న కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో విస్తరించానికి దాదాపు వారం నుంచి 15 రోజుల సమయం పడుతుంది అంటే జూన్ 2 వారం లోగ నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంద్వారా ఎండలు తగ్గు ముఖం పట్టే అవకాశం వుంది . ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ఇప్పటీకె నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. జూన్‌ 4 నుంచి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించనున్నాయి .

బ్యాంకు అకౌంట్ లేకున్నా రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చా ?

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎండా వడగాల్పులు లకు అల్లాడుతున్నారు . రోజురోజుకూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. రెండు రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దీనితో అవసరం అయితే తప్ప ప్రజలు బయటకి రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది .


మరోవైపు ఆదివారం నుంచి రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది .అత్యధికంగా ఈ ప్రభావం దక్షిణ తెలంగాణలోని జిల్లాపై ఉండనున్నట్లు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది .

బ్యాంకు అకౌంట్ లేకున్నా రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చా ?

Share your comments

Subscribe Magazine