జై జవాన్ .. జైకిసాన్ ఇది అందరు తమకు రైతులపై ఉన్న ప్రేమకు అందరు పెట్టె స్టేటస్ కానీ వాస్తవానికి వచ్చే సరికి రైతుకు ఎక్కడ కూడా తగిన గౌరవం మర్యాద దక్కడం లేదు ఏ ఒక్క అధికారి రైతుతో గౌరవప్రదం గ మాట్లాడినా పాపాన పోలేదు .. తన రెక్కలను ముక్కలుగా చేసి దేశానికి అన్నం పెట్టె రైతన్న తీసుకున్న లోనే కట్టలేదని మహబూబాబాద్ జిల్లాలో డీసీసీబీ బ్యాంక్ సిబ్బంది రైతు ఇంటి తలుపులు పీకుకువెళ్లిన ఘటన అందరిని ఆగ్రహానికి గురిచేసింది .
తమదగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు రాగానే కడతామన్న .. ఎదో రైతు దేశం వదలి పారిపోతున్నట్లు వ్యవహరించారు బ్యాంకు సిబ్బంది
రూల్స్ పేరుతో రెచ్చిపోయారు. జప్తు పేరుతో ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు బ్యాంక్ సిబ్బంది. ఆ రైతు కుటుంబం ఏదో దేశద్రోహం చేసినట్లు పోలీసులను కూడా తమతో తీసుకెళ్లి.. తమ కండకావరం ప్రదర్శించారు. ఫర్నీచర్, సామాగ్రిని సైతం ఆటోలో ఎక్కించి బ్యాంక్‌కి తరలించారు.
ఈ ఏడాది తేజ రకం మిర్చికి రికార్డు ధర ..ఎంతనో తెలుసా !
దీంతో.. అవమానభారంతో కన్నీరుమున్నీరు అయ్యింది బాధిత కుటుంబం. ఆ ఇంటి ఆడబిడ్డ అయితే ఎంతో ప్రాధేయపడింది కానీ బ్యాంక్ సిబ్బంది.. ఆమె బాధను పట్టించుకోలేదు. 2021లో వ్యవసాయ రుణం తీసుకున్నాడు రైతు మోహన్. పంట నష్టపోవడంతో అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో.. జప్తు పేరుతో ఈ రకంగా అతి చేశారు సిబ్బంది. విషయం తెలియడంతో… బ్యాంక్ సిబ్బందిపై డీసీసీబీ చైర్మన్ రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో వెంటనే సిబ్బంది రైతు ఇంటికి వెళ్లి సామాగ్రి ను అప్పగించారు .
ఇది తెలిసిన జనం బ్యాంకు సిబ్బంది పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు ..వేల కోట్లు బ్యాంకుల నుంచి దోచేసినవారు ధనబలంతో దర్జాగా బయట తిరుగుతుంటే .. సాధారణ రైతు , జనాలను బ్యాంకు వాళ్ళు ఇలా వేధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
Share your comments