News

ఈ ఏడాది తేజ రకం మిర్చికి రికార్డు ధర ..ఎంతనో తెలుసా !

Srikanth B
Srikanth B

మిర్చి రోజు వార్తలలో వుండే పంట కొన్ని సార్లు పడిపోయిన రేట్లతో రైతును కన్నీరుకు గురిచేస్తుంటే కొన్ని సార్లు మాత్రం రికార్డు ధర పలికి రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది , గతంలో వరంగల్ మార్కెట్లో దేశీయ రకం మిర్చి ఏకంగా రూ . 81 వేలు ధర పలికి రికార్డు సృష్టించగా ఇప్పుడు ఖమ్మం మార్కెట్లు తేజ రకం మిర్చి రికార్డు ధర పలికి రైతును ఆశ్చర్యానికి గురిచేసింది .

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం తేజా రకం మిర్చి క్వింటాకు ధర రూ.21,800గాపలికింది . సోమవారం రూ.21,600గా ఉన్న ధర ఒకే రోజులో రూ.200 మేర పెరగడం విశేషం. ప్రస్తుత సీజన్‌తో పాటు పంట సీజన్లలో దేశంలోనే ఈ ధర అత్యధికమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.


పెరుగుతున్న తెగుళ్ల దాడి దీనితో దిగుబడి పై తీవ్ర ప్రభావం పడడంతో మార్కెట్టుకు వచ్చే మిర్చి తగ్గింది దీనితో దళారుల మధ్య పోటీ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి అంటే కాకూండా తేజ రకం మిర్చికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉండడం కూడా కారణం , భారతదేశం నుంచి ప్రధానంగా చైనా నుంచి ఎగుమతిదారులకు ఆర్డర్లు వస్తుండగా, వ్యాపారులు పోటీ పడి ధర పెంచుతున్నారు.దీనితో రైతుకు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అయ్యే అవకాశం ఉండడంతో రైతులు హర్షం వ్యకతం చేస్తున్నారు .

ఏపీ రైతులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి మద్దతు ధరకు పప్పు ధాన్యాల కొనుగోలు !

సోమవారం రూ.21,600గా ధర పలకడంతో మంగళవారం సైతం అదే ధర ఉంటుందని భావించగా మరింత పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా, కారేపల్లి మండలం మొట్లగూడెంకు చెందిన పొడెం బిక్షపతి తీసుకువచ్చిన 22 బస్తాల మిర్చికి అత్యధిక ధర లభించడంతో రైతుతో పాటు ఖరీదుదారులను మార్కెట్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి శ్వేత, ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షి మల్లేశం సన్మానించారు.

ప్రస్తుత సీజన్లో మార్కెట్ అంచనా ప్రకారం ఇదే గరిష్ట ధరగా మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు .

ఏపీ రైతులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి మద్దతు ధరకు పప్పు ధాన్యాల కొనుగోలు !

Related Topics

chilli crop

Share your comments

Subscribe Magazine