సాధారణంగా దుంపలు అంటే మనకు భూమి లోపల ఊరుతుంది. కానీ గాల్లో కూడా దుంపలు పండుతాయని మీకు తెలుసా? వినడానికి కొంతవరకు ఆశ్చర్యంగా ఉన్నా గాల్లో తేలాడే దుంపలు కూడా ఉన్నాయి. తీగలకు కాసే ఈ దుంపలను ఎయిర్ పొటాటో, అడవి పెండలం, గాయి గడ్డలు, అడవి దుంపలు, అప్ప గడ్డలు అని కూడా పిలుస్తారు. ఎంతో అరుదైన ఈ దుంప మొక్క ఎక్కువగా అటవీ ప్రాంత వాసులకు సుపరిచితమైనది. ఎంతో వైవిధ్యమైన గాల్లో తేలాడే దుంపలను సీనియర్ సిటీ ఫార్మర్ లత ఇంటి పంటగా పెంచుతోంది.
హైదరాబాద్ బిహెచ్‌ఇఎల్ ప్రాంతంలోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో స్వగృహంలో నివాసం ఉంటున్న ఆమె తమ ఇంటిపైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. అయితే ఈ విధంగా గాలిలో వేలాడే దుంపలను గత సంవత్సర కాలంలో శిల్పారామంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం నిర్వహించిన మేళాలో ఈ విభిన్న జాతికి చెందిన దుంపల విత్తనాలను కొనుగోలు చేశారు.
ఈ విధంగా ఈ విత్తనాలను కొనుగోలు చేసిన ఆమె తెచ్చి వారం రోజులైనా నాటక పోవడంతో అవి మొలకలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఓ కుండీలు విత్తనాలను నాటక అవి తీగలుగా పాకి ఈ విధంగా దుంపలుగా వృద్ధి చెందుతున్నాయి. ఈ చెట్టు ఆకులు చూడటానికి తమలపాకులు వలె పోలి ఉంటుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ దుంప కోతకు వస్తుంది. తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషక విలువలు ఉన్నాయని , బంగాళదుంపలతో వీటికి ఏ మాత్రం పోలిక ఉండదని ఈ సందర్భంగా లత తెలియజేశారు.
Share your comments