ఉదయాన్నే బడికి వచ్చే విద్యార్థులు పస్తులు ఉండకూడదని భావించిన తమిళనాడు ముఖ్యమంత్రి దేశంలోనే మొదటిసారిగా స్కూల్ విద్యార్థులకు అల్పాహారాన్ని అందించే పథకాన్ని ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ నేడు ప్రారంభించారు.
అల్పాహార పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందించే కార్యక్రమాన్ని శుక్రవారం నాగపట్నం జిల్లాలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు . 1,545 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5 తరగతుల్లో 1,14,095 మంది విద్యార్థులకు పోషకాలతోకూడిన అల్పాహారాన్ని అందించనుంది.
దేవుని హుండీలో రూ. 100 కోట్ల చెక్కు.. తీరా చూస్తే
దేశంలోనే మొదటిసారిగా మధ్యన భోజన పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఈ తీర్మానం మార్గం సుగమం చేసింది. కొద్దికాలం విరామం తర్వాత 1957లో అప్పటి ముఖ్యమంత్రి కె.కామరాజ్ నేతృత్వంలో ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మొదటి సరిగా ప్రభుత్వం ప్రారంభించింది . ఇప్పుడు దేశంలోనే మొదటి సరిగా తమిళనాడు ప్రభుత్వం అల్పాహార పథకాన్ని ప్రారంభించింది నేటి నుంచి ప్రారంభమైన ఈ పథకం ఎప్పుడు అందరి ప్రశంశలని అందుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే మధ్యన భోజనం కూడా సరిగ్గా అందడం లేదని వాపోతున్నారు తల్లి తండ్రులు .
ఈ పథకం ద్వారా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 31,000 ప్రభుత్వ పాఠశాలలో, 17 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చనుంది.
Share your comments