మీరు వ్యవసాయం చేస్తున్నారా?వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొత్త కారు కొనాలనే ఆలోచనలు ఉంటే మీకిది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. రైతులు కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా రైతులు ఎంతో సులభంగా కొత్త కారును తమ సొంతం చేసుకోవచ్చు.దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ రైతుల కోసం సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా రైతులు కారు కొనడానికి సులభ పద్ధతిలో రుణాలను అందజేస్తోంది.
రైతులకు ఈ విధమైనటువంటి ఆఫర్ కల్పించడం కోసం టాటా మోటార్స్ సుందరం ఫైనాన్స్ తో జత కట్టి ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే కొత్తగా కారు కొనాలనుకునే రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సుందరం ఫైనాన్స్ ద్వారా కారు మొత్తానికి సరిపడా రుణాన్ని తీసుకోవచ్చు. అయితే ఈ రుణాన్ని ప్రతినెలా కాకుండా ఆరు నెలలకు ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది.
తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి ఆరు సంవత్సరాలు లోపు రుణాన్ని తీర్చాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆరు నెలలకు ఒకసారి వాయిదాలలో కట్టే ఈ పథకాన్ని కిసాన్ కార్ స్కీమ్ అని అంటారు ఆరు నెలలకు ఒకసారి రైతుల చేతికి పంట అందినప్పుడు ఈ వాయిదాలలో చెల్లించే అవకాశాన్ని రైతులకు కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రైతులు కలలుగన్న కొత్త కారును సొంతం చేసుకోవచ్చు.
Share your comments