News

TS Police Jobs 2022: తెలంగాణా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల !

Srikanth B
Srikanth B

TS Police Jobs 2022:ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి.. గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది.

 తెలంగాణా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి.. గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో మొత్తంగా 677 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేష‌న్ విడుదల చేసింది.

ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌కు సంబందించిన ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ (హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌ (ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 614 పోస్టులకు గురువారం (ఏప్రిల్ 28) నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థులు మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన వివరాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌లో ఉన్నాయి. 

Telangana police job :తెలంగాణ పోలీస్‌శాఖ లో 16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ..

ముందుగా 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ జారీచేసింది. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉండగా.. 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అనంతరం 503 గ్రూప్‌-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

 

TSPSC GROUP1:అధికారక గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల...95% రేజర్వేషన్లు స్థానికులకే!

Share your comments

Subscribe Magazine