ఒకప్పుడు పోలానికి నీరు పెట్టాలంటే రైతులు రాత్రి మొత్తం పడిగాపులు కాయాల్సి వచ్చేది. నీళ్ల కోసం రైతుల మధ్య గొడవలు జరిగేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. రైతులు రాత్రి మొత్తం నిద్ర లేకుండా పోలం దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుత టెక్నాలజీ కాలంలో అంతా సెల్‌ఫోన్ ద్వారా పనులు జరిగిపోతున్నాయి. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ ద్వారా ఎక్కడినుంచైనా ఏ పనినైనా మనం చేయవచ్చు.
ఇప్పుడు పోలానికి వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే సెల్‌ఫోన్ ద్వారా నీళ్లు పెట్టేలా ఒక సరికొత్త టెక్నాలజీని తెలంగాణకి చెందిన యువ రైతులు రూపొందించారు. దీని ద్వారా సెల్‌ఫోన్ నుంచే మోటర్ ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. మోటార్ పంపు సెట్‌లో ఒక సిమ్ కార్డు అమర్చుతారు. దీనిని రైతుల మొబైల్ నెంబర్‌కి అనుసంధానం చేస్తారు. దీంతో రైతులు ఎక్కడున్నా మోటార్ ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక కరెంట్ పోయినా, ఎలాంటి సమస్యలు వచ్చినా రైతుల మొబైల్ కి వాయిస్ మెసేజ్ వెళుతుంది.
ఈ టెక్నాలజీ ద్వారా రైతులు రాత్రపూట పోలాల వద్ద ఉండాల్సిన అవసరం ఉండదు. మార్కెట్ లో ఈ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే వీటిని విక్రయించుకుని ఉపయోగించుకోవచ్చు.
Share your comments