News

విత్తనాలకు సబ్సిడీ ఖరారు చేసిన ప్రభుత్వం

KJ Staff
KJ Staff

రాష్ట్ర ప్రభుత్వాలు విత్తనాలపై రైతులకు సబ్సిడీ ఇస్తున్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేయూత అందించేందుకు విత్తనాలపై సబ్సిడీ ప్రకటిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుండగా.. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం వరకు ఇస్తున్నాయి. విత్తనాలను బయట కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నాయి.

ఏపీలో రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తుండగా.. తెలంగాణలో ప్రత్యేక కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీపై విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అందులో భాగంగా తాజాగా విత్తనాలకు సబ్సిడీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఏయే విత్తనాలకు ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

సోయాబీన్, పచ్చిరొట్ల,పిల్లిపెసర, జనుము విత్తనాలపై సబ్సిడీని ఖారారు చేస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సోయాబీన్ విత్తనాల ధర క్వింటాలుకు రూ.9,650 ఉండగా.. 40.65 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుంది. సబ్సిడీ పోగా క్వింటాలు విత్తనాలపై రైతులు రూ.5,727 చెల్లించాల్సి ఉంటుంది. సోయాబీన్, పచ్చిరొట్ట విత్తనాలకు కలిపి ఈ సంవత్సరం రూ.70.34 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది.

సోయాబీన్ విత్తనాలకు రూ.15.69 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక పచ్చిరొట్ల విత్తనాలకు రూ.54.65 కోట్ల ఖర్చు చేయనుంది. పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి జీలుగ విత్తనాలకు రూ.41.73 కోట్లు సబ్సిడీ ఇవ్వనుంది. ఇఖ జీలుగ ధైంచా విత్తనాలు క్వింటాలుకు రూ.5,350 ఉండగా.. 65 శాతం సిబ్సిడీ ఇవ్వనుంది. 65 శాతం సబ్సిడీ పోతే రూ.1872కే విత్తనాలు రానున్నాయి.

ఇక జనుము, పిల్లిపెసర విత్తనాలపై 65 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. ఇప్పటికే 25 వేల క్వింటాళ్లు జనుము, 4 వేల క్వింటాళ్ల పిల్లిపెసర, 25 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. పచ్చిరొట్ల సాగను పెంచాలని రైతలుకు ప్రభుత్వం సూచించింది.

Share your comments

Subscribe Magazine