News

తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు !

Srikanth B
Srikanth B

హైదరాబాద్: వరి కి బదులుగా రాబోయే ఖరీఫ్ సీజన్‌లో పత్తి, మిర్చి, ఎర్రజొన్న, పొద్దుతిరుగుడు, పుచ్చకాయ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుంది.
రబీ వరి సాగు దాదాపు 50 లక్షల ఎకరాల నుంచి 35 లక్షల ఎకరాలకు తగ్గింది. ఫలితంగా లాభాలు వచ్చే పంటలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యవసాయ సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో వ్యవసాయాభివృద్ధికి ఆటంకంగా మారుతున్న కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఈ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

"ఏడాది తర్వాత వరి సాగును కొనసాగిస్తే నేల నాణ్యత క్షీణించే ముప్పు ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు.కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో , చైనా తెలంగాణ పత్తి అవసరాన్ని పెంచింది. తెలంగాణ పత్తి కూడా మార్కెట్‌లో బాగా అమ్ముడవుతోంది

ఈ నేపథ్యంలో పత్తి సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ మార్కెట్‌లో మిరపకాయ క్వింటాల్‌ కు  రూ.42 వేల ధర పలుకుతుందని, ప్రత్యామ్న్యాయ పంటలు కూడా రైతులకు లాభాన్ని చేకూరుస్తాయని వెల్లడించారు .

వరి కొనుగోలు కేంద్రాలు:

రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,983 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 32 కేంద్రాల్లో వరి సేకరణ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 1,200 టన్నులు సేకరించినట్లు వెల్లడించారు . 

Zinc Deficiency :వరి పంట లో జింక్ లోపము-సమగ్ర నివారణ మార్గాలు!

Share your comments

Subscribe Magazine