News

ఏప్రిల్‌ 14 నుంచి గొర్రెల పంపిణీ కి సన్నాహాలు .. త్వరలో మార్గదర్శకాలు !

Srikanth B
Srikanth B

తెలంగాణ ప్రభుత్వం అందించే పథకాలలో గొర్రెల పంపిణీ పథకం ఒకటి మొదటి విడత గొర్రెల పంపిణీ జరిగి చాల కాలం కావడంతో రెండో విడత గొర్రెల పంపిణి కోసం ఎదురుచూస్తున్నా గొల్ల సోదరుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది , తెలంగాణ ప్రభుత్వం రెండొవ విడత గొర్రెల పంపిణీ కి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని ఏప్రిల్‌ 14నుండి ప్రారంభించాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాష్ట్ర జీవాల పెంపకందారుల సంక్షేమ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ సూత్రప్రాయంగా నిర్ణయించారు.


2017లోనే రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 3, 61, 000 మంది లబ్దిదారుల ఎంపిక జరిగింది.రెండో విడత గొర్రెల పంపిణీ తో రాష్ట్రంలోని 3, 61, 000 జీవాల పెంపకందారులకు లబ్ది చేకూరనుంది. రెండో విడత గొర్రెల పంపిణీ పథకం అములపై వారం తర్వాత రాష్ట్రస్థాయిలో మంత్రి తలసాని ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం గొర్రెల పంపిణీపై మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం గొల్ల, కురుమలకు 75శాతం స బ్సీడీపై జీవాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత గొర్రెల పంపిణీ కింద 3, 93, 000 మంది కాపరులకు గొర్రెలను పంపిణీ చేశారు.

లబ్దిదారులకు పంపిణీ చేసే ఒక్కో యూనిట్‌ గొర్రెల విలువ రూ.1,75,000గా ఉండగా ఇందులో 25శాతం అంటే రూ. 43,250 లను లబ్దిదారులు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 1, 31, 750 రూపాయల విలువను సబ్సీడీ కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. లబ్దిదారులకు గొర్రెల యూనిట్‌తోపాటు ముందులతో కూడిన కిట్‌, ఏడాదిపాటు జీవాలకు, పెంపకందారులకు బీమా సదుపాయం, గొర్రెల కొనుగోలుకు అయ్యే రవాణా వ్యయాన్ని కూడా ప్రభుత్వమే సమకూర్చనుంది.

"రైతులకు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ "-రేవంత్ రెడ్డి

ఏప్రిల్‌ మొదటి వారంలో లబ్దిదారులు డీడీలు చెల్లించాలని చెప్పడంతోపాటు గొర్రెలను పొందేందుకు ఉండాల్సిన అర్హతలను పేర్కొంటూ ప్రకటనను రాష్ట్ర జీవాల పెంపకందారుల అభివృధ్ది కార్పోరేషన్‌ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ విడుదల చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.

"రైతులకు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ "-రేవంత్ రెడ్డి

Related Topics

Sheep distribution

Share your comments

Subscribe Magazine

More on News

More