News

"రైతులకు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ "-రేవంత్ రెడ్డి

Srikanth B
Srikanth B

నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో' యాత్రలో భాగంగా కమ్మర్ పల్లిలో ఆదివారం రైతులతో రేవంత్ మాట్లాడుతూ రైతులపై హామీల వర్షం కురిపించారు , తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల రైతులకు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు .

 

అంతేకాకుండా రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటిం చారు, రాష్ట్రంలో రైతులకు ఏ సమస్య ఉన్న రైతు కమిషన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు , రైతులకు అన్యాయం జరగ కుండా రైతు కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఇందిరమ్మ రైతు భరోసా పేరుతో రైతులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. పంటల బీమా అమలు చేసి.. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపో యిన రైతులకు ప్రతిపైసాను పరిహారం కింద చెల్లి స్తాం" అని చెప్పారు.

అదేవిదం గ రైతు ప్రతి కుటుంబానికి ఏటా రూ.12 వేలు ఉచితంగా ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 నెలల్లో నిజాంషుగర్ ప్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. రైతులు, కౌలు రైతులకు హెల్త్ కార్డులు ఇస్తా మని చెప్పారు. రాష్ట్రంలో ఫసల్ బీమా, పంట బీమా పథకాలు లేక రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

PM కిసాన్: ఆన్‌లైన్‌లో తప్పులను సవరించుకోండి ఇలా!

 

ప్రతి పేదవాడికి రూ. 5లక్షల మేర ఉచిత వైద్యం అందిస్తాం. గ్యాస్ సిలిండర్ రూ .500కే ఇస్తాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పసుపు క్వింటాకు రూ.12 వేలు, చెరుకు రూ.4 వేలు, సోయా బీన్ రూ.4,400, వరి రూ.2,500, ఎర్రజొన్న రూ.3,500 ధరతో కొనుగోలు చేస్తాం” అని హామీ ఇచ్చారు.గత ఎన్నికలలో గెలిచేనా బీజేపీ అభ్యర్థి పసుపు బోర్డు తెస్తానని రైతులను నమ్మించి మోసం చేసాడని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తాము అన్నారు .

PM కిసాన్: ఆన్‌లైన్‌లో తప్పులను సవరించుకోండి ఇలా!

Related Topics

PCC chief Revanth Reddy,

Share your comments

Subscribe Magazine