News

హైదరాబాద్ :కంటోన్మెంట్ ప్రాంతాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేత?

Srikanth B
Srikanth B

కేంద్ర ప్రభుత్వం, రక్షణ అధికారులు లకు  పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోవడం తో విసుగు  చెందిన తెలంగాణ ప్రభుత్వం, ట్రాఫిక్ గందరగోళానికి దారితీసే రహదారులను  మూసివేయడంతో పాటు, హైదరాబాద్ లోని కంటోన్మెంట్ ప్రాంతాలకు విద్యుత్, నీటి సరఫరాను తగ్గించాలని నిర్ణయించింది.

అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతాలకు నీరు మరియు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మున్సిపల్, పరిశ్రమల మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. "అవును, మేము ఆ ప్రాంతాలకు విద్యుత్ మరియు నీటి సరఫరాను తగ్గించాలని నిర్ణయించుకున్నాము మరియు రోడ్లు మరియు సౌకర్యాల అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి రక్షణ మంత్రిత్వ శాఖ లేదా దాని అధికారులు ఒక అడుగు క్రిందికి వస్తారా అని మేము ఆశిస్తున్నాము " అని ఆయన పునరుద్ఘాటించారు.

కంటోన్మెంట్ పరిధిలోని రహదారుల నిర్మాణంలో , మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరిపేటప్పుడు వారు సహకరించడం లేదని అయన వెల్లడించారు.

సికింద్రాబాదులోని కంటోన్మెంట్ ప్రాంతం మరియు గోల్కొండ కంటోన్మెంట్ సమీపంలోని ఎఎస్ఐ ప్రాంతం రెండూ రహదారులను మూసివేస్తున్నారు , రోడ్లు వేయడానికి అనుమతి నిరాకరిస్తున్నారు , నదీమ్ కాలనీ మరియు లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడానికి దారితీసే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని ఆయన వెల్లడించారు .

అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకపోతే విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేస్తామని మున్సిపల్, పరిశ్రమల మంత్రి కెటి రామారావు అన్నారు.

ఇంక చదవండి.

ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త, హోలీ కి ముందే 11వ విడత రూ. 2000 విడుదల.. (krishijagran.com)

BIG UPDATE : CM KCR : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త వెంటనే 91142 ఖాళీ పోస్టుల భర్తీ ,స్థానికులకే 95 శాతం రిజర్వేషన్ ! (krishijagran.com)

Related Topics

ktr telanganaminister TRS

Share your comments

Subscribe Magazine

More on News

More