News

ఇల్లు కట్టలనుకునే వారికీ 15 రోజుల్లో 3 లక్షలు-సీఎం కెసిఆర్

Srikanth B
Srikanth B
CM KCR @Mahaboobnager public meeting
CM KCR @Mahaboobnager public meeting

 

తెలంగాణ ముఖ్యమంత్రి ఆదివారం మహబూబ్ నగర్ సమీకృత కలెక్టర్ ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ తెలంగాణాలో ఇండ్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటే 3 లక్షల రూపాయల నగదును అందిస్తామని లబ్దిదారులకు ఈమొత్తం కేవలం 15 రోజులలో అందించే విధముగా పాలసీని రూపొందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

 

ప్రతి గ్రామంలో పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిది అందుకు ఇల్లు లేని నిరుపేదలకు 3 లక్షలు సాయం అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని , ప్రతి గ్రామంలో లబ్దిదారులను గుర్తించే బాధ్యత MLA లు తీసుకోవాలని త్వరలో దీనికి సంబందించిన లబ్ది దారుల జాబితాను గుర్తించి ప్రభుత్వానికి అందించాలని , అర్హులను వారికీ 15 రోజులలో 3 లక్షలు అందించే విధముగా ప్రభుత్వం పథకం రూపకల్పన చేస్తున్నదని తెలిపారు . ఇదే ప్రకటను గత కొన్ని రోజుల క్రితం KTR చేసిన విషయం తెలిసినదే .

ఎద్దు మూత్రం పోసినందుకు ఫైన్ .. భద్రాద్రి కొత్తగూడెం వింత ఘటన !

కల్వకుర్తి , భీమా , నెట్టెంపాడు ,కోయిల్ సాగర్ ప్రాజెక్టులను గత పాలకులు నిర్లక్ష్యం చేసారని కానీ రాష్ట్రము వచ్చినాక మిషన్ కాకతీయ పేరుతో చెరువులన్నీ నిండి తెలంగాణ వ్యాప్తముగా సాగు పెరిగిందని , రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి తెలిపారు . తెలంగాణ రైతు గర్వంతో జీవించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నాడని , మహబూబ్ నగర్ లో గతంలో వలసలు అధికముగా ఉండేవని , రాష్ట్రము వచ్చినాక వలసలు తగ్గిపోయాయని ముఖ్యమంత్రి తెలిపారు .

ఎద్దు మూత్రం పోసినందుకు ఫైన్ .. భద్రాద్రి కొత్తగూడెం వింత ఘటన !

Related Topics

ap cm ys jagan cmkcr

Share your comments

Subscribe Magazine

More on News

More