News

తెలంగాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ...

Srikanth B
Srikanth B
తెలంగాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ...
తెలంగాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ...



తెలంగాణాలో ఎండలు తీవ్రంగా వున్నాయి .. ఈ ఎండాకాలం సీజన్ లో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్‌లో తొలిసారిగా 46 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఇప్పటివరకు నమోదయిన ఉష్ణోగ్రతల్లో అత్యధికం ఇదే మే 25 నుంచి రోహిణి కార్తె కాలం ప్రారంభం కానున్నందున రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా.

 

రాష్ట్రంలో ఎండాకాలం చివరి నెలకు చేరుకోవడంతో భానుడి భగ భగ లకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు . రాష్ట్రం లోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో అత్యధికంగా 46.4°C, మహబూబాబాద్‌లోని బయ్యారం, ఖమ్మం అర్బన్‌లో 45.4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కూడా 45 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఇతర జిల్లాల్లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కస్పిట్ మండలం కొండాపూర్ గ్రామంలో 44 డిగ్రీల సెల్సియస్, నస్పూర్‌లో 43.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల దగ్గరగా వున్నాయి దీనితో వాతవరణ శాఖ మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది .

ఇది కూడా చదవండి .

కట్నం అడిగినా, తీసుకున్నా డిగ్రీ రద్దు! తెలంగాణ లో కూడా అమలు అవ్వనుందా?

హైదరాబాద్ లోని ఈ ప్రాంతాలలో అత్యధికంగా 41 ° C కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి బుధవారం ఖైరతాబాద్‌లో అత్యధికంగా 41.6°C, సెరిలింగంపల్లి (41.3°C), కూకట్‌పల్లి (40.5°C)ల ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి .

ఇది కూడా చదవండి .

కట్నం అడిగినా, తీసుకున్నా డిగ్రీ రద్దు! తెలంగాణ లో కూడా అమలు అవ్వనుందా?

Related Topics

heatwave alert

Share your comments

Subscribe Magazine