News

మరో ఘనతను సాధించిన వరంగల్ ..యునెస్కో గ్లోబల్ లెర్నింగ్ సిటీస్ లోచోటు

Srikanth B
Srikanth B

తెలంగాణ రాష్ట్రములో హైదరాబాద్ తరువాత వరంగల్ రెండొవ అతిపెద్ద నగరంగ ఉంది , ఇప్పుడు ఈనగరం మరో అరుదైయిన ఘనతను సాధించింది . అరుదైన యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. వరంగల్‌లోని రామప్ప ఆలయానికి వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది.

సరిగ్గా ఏడాది తరువాత యునెస్కో నుంచి మరో అరుదైన గుర్తింపును సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుదుగా చెప్పుకొనే యునెస్కో గుర్తింపును ఏడాదికాలంలో రెండుసార్లు సాధించడం వారంగాలా నగరానికి ఉన్న ప్రత్యేకత. యునెస్కో గుర్తింపు లభించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేసారు మరోవైపు ఈ గుర్తింపు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవ చూపారని అన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి, దార్శనికతతోనే ఇది సాధ్యమైందని మేయర్ గుండు సుధారాణి చెప్పారు.

పెరుగుతున్ననిత్యావసర ధరలకు నిరసనగా ర్యాలీ ..

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీనికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మోదీ చేసిన కృషి, చూపిన చొరవతోనే ఇది సాధ్యమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ఘన వారసత్వంగా నిలిచిన వరంగల్‌- యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లల్లో చోటు దక్కడం ఇక్కడి ప్రజల గర్వకారణమని చెప్పారు. తెలంగాణ, వరంగల్ ప్రజలకు జీ కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. యునెస్కో గుర్తింపు రావడం పట్ల ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు.

పెరుగుతున్ననిత్యావసర ధరలకు నిరసనగా ర్యాలీ ..

Share your comments

Subscribe Magazine