News

Telangana: రైతులకు, కార్మికులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్......

KJ Staff
KJ Staff

తెలంగాణలోని రైతులకు, మరియు గల్ఫ్ దేశం కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. రైతులకు అందిస్తామన్న రుణమాఫీని మరి కొద్దీ నెలల్లోనే అమలుచేయనున్నట్లు తెలిపారు. అలాగే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ పౌరుల కోసం ప్రభుత్వం కొత్త విధానం అవలంభిస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న హామీల్లో, రైతు రుణమాఫీ కూడా ఒకటి. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడిచిన రైతు రుణమాఫీ చెయ్యలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ధీటుగా రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రైతు రుణమాఫీ చెయ్యడం వీలుకావట్లేదని, ఎలక్షన్స్ ముగిసాక, ఆగష్టు లోపు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పినవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. దీని ద్వారా తెలంగాణలోని కొన్ని లక్షల రైతు కుటుంబాలు లబ్ధిచెందుతాయని అయన తెలిపారు. ఎన్నికల మానిఫెస్టోలో ఆరు గారంటీలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రుణాలు తీసుకున్న రైతులకు ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ ఉంటుందని హామీయిచ్చారు.

అంతేకాకుండా నేడు తాజ్ డెక్కన్లో గల్ఫ్ కార్మికుల సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకురానుందన్నారు. గల్ఫ్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేసి దీనిలో ఒక ఐఏఎస్ అధికారిని ఇతర సిబందిని నియమించి, ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 5లక్షల ఇవ్వాలని నిర్ణయించారు, అలాగే వారికి కూడా భీమా సౌకర్యం కల్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలియచేసారు. గల్ఫ్ కార్మికులు తమ ఇబ్బందులు తెలియపరచడానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా తొందర్లోనే ఏర్పాటు చేస్తామన్నారు.

Share your comments

Subscribe Magazine

More on News

More