ప్రపంచమంతా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో, సముద్ర మట్టాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతి ఏడాది సముద్రంలోని నీరు సగటున 0.14 ఇంచుల పెరుగుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సముద్రతీర ప్రాంతాల్లోని పట్టణాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నగరం, ఈ శతాబ్దం చివరినాటికి మునిగిపోయే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్లోబల్ వార్మింగ్ సమస్య అధికంగా ఉంది, దీని ప్రభావం వలన వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అకాల వర్షాలు, తుపాన్లు, అధిక ఉష్ణోగ్రతలు ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ సమస్య తీవ్రరూపం దాల్చుతుందనడానికి సంకేతాలే. వాతావరణ మార్పుల కారణంగా అంటార్కిటికా ప్రాంతంలో ఐస్ కరిగి, సముద్ర మట్టాలు క్రమంగా పెరగడానికి కారణమవుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల మీద దీని ప్రభావం అధికంగా ఉంటుంది. తీరప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం థాయిలాండ్లోని సముద్ర మట్టం పెరుగుతుండడంతో, ఆ దేశ రాజధాని బ్యాంకుకు ను తరలించాలని అక్కడి పర్యావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. సముద్ర మట్టం ఇదే విధంగా పెరుగుతూ వస్తే ఈ శతాబ్దం చివరినాటికి లోతట్టు ప్రాంతాలని పూర్తిగా నీటమునిగే ప్రమాదమున్నట్లు అక్కడికి అధికారులు వెల్లడించారు.
థాయిలాండ్ దేశం ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉండే దేశం. నిత్యం జనసందోహం ఉండే ఈ ప్రాంతం ఇప్పటికే కరువు, వేడి, కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి ప్రమాదాలను ఎదుర్కొంటుంది. ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు దాటి ఉంటున్నట్లు అక్కడి వాతావరణ శాఖ గుర్తించింది, దీనివలన సముద్రం నీరు తాకుతుందని భావిస్తున్నారు. ముంపు ప్రమాదం నుండి ప్రజలను రక్షించేందుకు ఈ నగరాన్ని తరలించవలసి ఉందని అధికారులు సూచించారు, కానీ ఇది ఎంతో కఠినతరం. పెరుగుతున్న వేడిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం అక్కడి ప్రభుత్వం కృషిచేస్తుంది. కాలుష్యానికి ముఖ్య కారణమైన పంట దహనాన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే అక్కడున్న ముఖ్యమైన వ్యాపారాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Share your comments