ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలందరికీ ఇళ్లు అందించే కార్యక్రమంలో భాగంగా రానున్న సంక్రాంతి పండుగను సందర్భంగా రెండో దశ ఇళ్లను హృదయపూర్వక కానుకగా అందజేయాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో లెక్కలు నిర్వహించి లక్ష్యాలను నిర్దేశించారు. జనవరిలో ప్రారంభమయ్యే సామాజిక పింఛను రూ.3వేలకు పెంచడంతో పాటు జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే పథకం నిధుల పంపిణీ జరిగేలా సన్నాహాలు చేస్తున్నారు.
సంక్రాంతి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల అమల్లో వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రతి నిరుపేద మహిళకు ఇల్లు అందించాలనే చిరకాల వాంఛను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో రానున్న సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలోని నిరుపేదలకు మరో ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసారు.
పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం పేదలకు కొండంత అండగా నిలిచి, ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. దీంతో ఏన్నో ఏళ్లగా సొంతింటి కల నేర వేర్చుకోలేని వారంతా ఇప్పుడు తమ ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారు. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తక్కువ స్థలంలోనైనా అందమైన ఇళ్లను నిర్మించుకుంటున్నారు.
రెండో విడత నిర్మాణాలపై ప్రభుత్వం పంపిణీ చేసి 30.75 లక్షల ఇంటి స్థలాలకు గాను 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చారు. తొలిదశలో ఇప్పటికే ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యిందని, ఇప్పుడు తదుపరి దశలో అదనంగా మరో ఐదు లక్షల ఇళ్లను సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేయాలని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ కొత్త విన్నింగ్ ఫార్ములా ఇదే..!!
సంక్రాంతి నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 98,308 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు గృహ నిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన 4 లక్షలకు పైగా ఇళ్లను నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసి పేదలకు అందించేందుకు గృహ నిర్మాణ శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల్లో 12,479 ఇళ్లు పూర్తి దశలో ఉండగా, లక్ష ఇళ్ల వరకు రూప్ లెవల్లో ఉన్నాయి.
ఎన్నికల సమయంలో పునాదుల దశలోనే మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు గణనీయంగా పెరిగాయని, ఈ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా లబ్ధిదారులకు విడతల వారీగా తిరిగి చెల్లించే వెసులుబాటుతో రూ.35 వేలు రుణం అందజేస్తోంది.
ఇంకా ఈ ఇళ్ల నిర్మాణాలకు సాయంగా రూ.15 వేల విలువైన ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదనంగా, డిపార్ట్‌మెంట్ స్టీల్, సిమెంట్ మరియు 12 రకాల నిర్మాణ సామగ్రిని ఒక్కొక్కటి రూ.40 వేల సబ్సిడీతో అందిస్తోంది, ఫలితంగా మొత్తం రూ.2.70 లక్షల అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఎట్టకేలకు సొంత ఇళ్లు, కొత్త ఊళ్లలో సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments