అందరూ ఎదురుచూస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సెప్టెంబరు 16న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. నార్లాపూర్‌లోని మెగా పంపుల మోటర్లను బటన్ నొక్కి ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని కరవు పీడిత దక్షిణ తెలంగాణలోని ప్రజలకు ఎంతో మేలు జరగనుంది . ఈ ప్రాజెక్టు ద్వారా 1,226 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చడంలో కీలకం కానుంది.
నార్లాపూర్ పంప్ హౌస్‌లో 145 మెగావాట్ల సామర్థ్యంతో తొమ్మిది మెగా పంపులు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నది నీటిని ప్రాజెక్టుకు 2 కిలోమీటర్ల దూరంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేయనున్నారు.
ప్రాజెక్టు ప్రారంభం అనంతరం ముఖ్య మంత్రి కెసిఆర్ అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ సభకు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు పెద్దఎత్తున బహిరంగ సభకు హాజరు అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
లక్ష మంది కొత్త లబ్దిదారులకు పెన్షన్
బుధవారం సచివాలయంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. సభకు హాజరయ్యే సాధారణ ప్రజల కోసం రవాణా ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఆమెకు సూచించారు.
Share your comments