News

లక్ష మంది కొత్త లబ్దిదారులకు పెన్షన్

Srikanth B
Srikanth B
లక్ష మంది కొత్త లబ్దిదారులకు పెన్షన్
లక్ష మంది కొత్త లబ్దిదారులకు పెన్షన్

పెన్షన్ రాలేదని ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శుభవార్త అందించారు . అన్ని అర్హతలు ఉండి పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న వారి సంశయాలను తీర్చి వారికీ పెన్షన్ అందించడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ జగనన్న సురక్ష పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

జగనన్న సురక్ష పథకం ద్వారా గుర్తించిన వారిని ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలో చేర్చనుంది. దీనితో అర్హులైన వారు ఇప్పుడు పెన్షన్ పొందే అవకాశాన్ని అందిస్తుంది . వైయస్సార్‌ ఆసరా పథకం కింద ప్రభుత్వం పెన్షన్లను ను ప్రతి నెల నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపు లబ్దిదారులకు అందిస్తుంది.

ఇప్పుడు తాజాగా వాలంటీర్లు స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం కొత్త లబ్దిదారుల చేరిక, వారి పేర్లతో జాబితాలను అప్‌ డేట్‌ చేయడం వంటి కారణాలతో పెన్షన్ల చెల్లింపు తేదీని తొలుత ఈనెల 7వ తేదీకి పొడిగించింది. అయితే తాజాగా దీన్ని ఈనెల 10వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 10వ తేదీ లోపు కొత్త వారితో కలుపుకొని అందరికీ పెన్షన్లు అందించబోతుంది ప్రభుత్వం.

నేడు తెలంగాణ, కోస్తాలో భారీ వర్షాలు.. తుపాను ముప్పును సూచించిన IMD

ప్రస్తుతం నెల నెల రూ.2750 పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం .. వచ్చే సంవత్సరానికి ఈ మొత్తాన్ని రూ. 3000 వేలకు పెంచనుంది .. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అర్హత ఉండి పెన్షన్ పొందని లక్ష మందికి లబ్ది చేకూరనుంది.

నేడు తెలంగాణ, కోస్తాలో భారీ వర్షాలు.. తుపాను ముప్పును సూచించిన IMD

Related Topics

10 lakh new pensions

Share your comments

Subscribe Magazine