టమాటా పంటను పండించిన రైతులు నష్టపోతున్నారు. రైతులకు కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో నష్టాలపాలాలుతున్నారు. గత సంవత్సరం టమాటకు డిమాండ్ బాగుందని రైతులు ఈ సంవత్సరం టమాటా పంటను సాగు చేశారు. ఆ రైతులకు అధిక ధరలు రాకపోగా నష్టాలికి గురయ్యి దిగులుపడుతున్నారు. టమాటా పంటలను పండించిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మార్కెట్ లో కొన్ని రోజుల కిందట వరకు కిలో టమాటా రూ. 20 నుంచి రూ.30 వరకు పలికింది. ఇలా యున్న ధర ఒక్కసారిగా పడిపోయింది, ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాటా ధర కేవలం రూ.5 మాత్రమే పలుకుతుంది. మార్కెట్ లో టమాటా కు ధరలు లేక రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం ఈసారి రైతులకు పంటను పండించడానికి పెట్టిన పెట్టుబడుల ధరలు కూడా చేతికి అందేలా లేవని రైతులు చెబుతున్నారు.
ఈ ఏడాది మెదక్ జిల్లాలో అత్యధికంగా యాంసంగిలో వెయ్యి ఎకరాల్లో రైతులు టమాటా పంటను సాగు చేశారు. జిల్లాలో ఎక్కువగా ఈ మండలాల్లో అనగా చేగుంట, మనోహరాబాద్, టేక్మాల్, నిజాంపేట, కొల్చారం, కౌడిపల్లి, హవేళిఘనపూర్, రామాయంపేట, తూప్రాన్, శివ్వంపేట మండలాల్లో టమాటా పంట సాగులో ఉంది.
గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా టమాటా పంట కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. రైతులకు ప్రస్తుతం పంట చేతికి అందేసరికి మార్కెట్ లో ధర తగ్గిపోయింది. దీనితో రైతులు నష్టాల బారిన పది బాధపడుతున్నాడు.
ఇది కూడా చదవండి..
రైన్ అలెర్ట్: పిడుగులతో కూడిన భారీ వర్షాలకు ఛాన్స్..
యాసంగిలో టమాటాకు గత ఏడాది అధికంగా డిమాండ్ ఉండడంతో రైతులు ఈ సారి టమాటా పంటను సాగు చేశారు. జిల్లాలో అత్యధికంగా సాగు చేస్తున్న కూరగాయల పంటల్లో మొదటిగా టమాటా పంట ఉంది. మిగిలిన కూరగాయల పంటలు అన్ని కలిపి 5వేల ఎకరాల్లో సాగుచేస్తుంటే, కేవలం టమాటా పంట మాత్రమే వెయ్యి ఎకరాల్లో ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు.
మొన్నటి వరకు మార్కెట్ లో 25 కిలోల టమాటా బాక్సు ధర రూ.1,200 వరకు పలికింది. కానీ ఈ ధర ఒక్కసారిగా పడిపోయి, ప్రస్తుతం కేవలం రూ.100 మాత్రమే మార్కెట్ లో పలుకుతుంది. ఒక ఎకరాలో టమాటా పంటను సాగు చేయడానికి తమకు సుమారుగా రూ.30 వేల వరకు ఖర్చవుతుందని, మార్కెట్ లో ధరలు చూస్తుంటే కూలీల ఖర్చు, రవాణా ఛార్జీలు కూడా తిరిగిరావడం లేదని రైతులు వాపోతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments