News

రైన్ అలెర్ట్: పిడుగులతో కూడిన భారీ వర్షాలకు ఛాన్స్..

Gokavarapu siva
Gokavarapu siva

హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి వరకు హైదరాబాద్ లో 40 డిగ్రీల ఎండలతో సూర్యుడు మండిపడుతుంతుంటే, తెల్లవారుజాము నుండి వర్షాలు దంచికొడుతున్నాయి. అర్ధరాత్రి నుండి వర్షాలు భారీగా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోత సమయం కావడంతో రైతులు తీవ్ర ఆందోళకు గురువవుతున్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంటలు దెబ్బతినడంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులను వరి పంట చేతికందే సమయంలో వడగళ్ల వాన భయం వెంటాడుతోంది.

వాతావరణ శాఖ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు కూడా పలుచోట్ల పిడుగులతో వర్షం పడే అవకాశం హెచ్చరించింది. ఇదే సమయంలో వచ్చే మూడు గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని అలర్జ్ జారీ చేసింది.

హైదరాబాద్ నగరమంతటా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. మణికొండ, షేక్ పేట్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రాంతాల్లో చాల చోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం కూడా ఉంది. ఇక్కడ కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇన్నాళ్లు ఎండల కారణంగా విసిగిపోయి ఉన్న ప్రజలు ఇవాళ కురిసిన వర్షాలతో కొంత మేర ఉపశమనాన్ని పొందారు.

ఇది కూడా చదవండి..

పాల ఉత్పత్తిలో నంబర్‌వన్‌గా ఉన్న ఇండియా.. ఇక విదేశాల నుండి దిగుమతులు తప్పవా?

వాతావరణ శాఖ నాగర్ కర్నూల్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నారాయణపేట్ జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరి కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ముషీరాబాద్‌, లకడీకపూల్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, ఉప్పల్ దాదాపు భాగ్యనగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తున్నది.

ఇది కూడా చదవండి..

పాల ఉత్పత్తిలో నంబర్‌వన్‌గా ఉన్న ఇండియా.. ఇక విదేశాల నుండి దిగుమతులు తప్పవా?

Related Topics

Heavy Rain Alert hyderabad

Share your comments

Subscribe Magazine