ఇటీవలి కాలంలో ఎంత కాదన్నా పెరిగిన ధరలతో ఆవు లేదా గేదెల ధర మహా అయితే లక్ష దాక ఉంటుంది , అయితే మహారాష్ట్ర ర్దన్‌వాడి(ఇందాపూర్‌లో) రైతు అనిల్ థోరట్‌కు చెందిన సంకర జాతి ఆవు ఏకంగా 2 లక్షల 11 వేలు ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది సంకర జాతికి చెందిన ఆవు ఇంత ధర పలకడం ఇదే మొదటి సారి , ఇంత ధర పలికిన ఆవు ప్రత్యేకతలు ఏంటో ఇక్కడా తెలుసుకుందాం !
మహారాష్ట్రలోని కర్దన్‌వాడి(ఇందాపూర్‌లో) రైతు అనిల్ థోరట్‌కు చెందిన సంకర జాతి ఆవు 2 లక్షల 11 వేల రూపాయల ధర పలికింది. ఈ ఆవు సగటున రోజుకు 28 లీటర్ల పాలను ఇస్తుంది , మొదటి ఈత తరువాత రెండొవ ఈతలో ఆవు పాలు ఉత్పత్తిలో గణనీయమైన మార్పు కనిపించింది ఆవుకు ఆహారంగా చెరకును మేతగా, మొక్కజొన్న, మొక్కజొన్న పొట్టు, ఇతర అవసరమైన ఆహారాన్ని అందించేవాడు , ఈ ఆవు గురించి తెలుసుకున్న మరో రైతు తుకారాం ఇంగ్లే రెండు లక్షల 11 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.
హెచ్ఎఫ్ జాతి కి చెందిన ఆవు రోజుకు 35 లీటర్ల వరకు పాల దిగుబడిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఆవు పాల ధర కనీసం రూ.40 ఉంది. ఎక్కువ పాలు ఇచ్చే ఒకే ఒక జాతి ఆవు. ఈ ఆవు పాల ద్వారా రోజుకు రూ.1500 రూపాయల వరకు ఆదాయం పొందుతాడు. పశువులకు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి.
మిర్చి :నాణ్యత సాకుతో తగ్గిస్తున్న ధరలు .. ఆందోళనలో రైతులు !
HF ఆవు" అనే పదం హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ జాతి పాడి పశువులను సూచిస్తుంది. హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవులు వాటి అధిక పాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి మరియు ప్రపంచవ్యాప్తంగా పాడి పెంపకానికి అత్యంత ప్రజాదరణ పొందిన జాతులలో ఒకటి. అధిక పాలు ఇవ్వడం ద్వారా వీటిలో అధికంగా పొదుపు వాపు వ్యాధి పాడి ఉత్పత్తి తగిపోతుంది.
Share your comments