News

మిర్చి :నాణ్యత సాకుతో తగ్గిస్తున్న ధరలు .. ఆందోళనలో రైతులు !

Srikanth B
Srikanth B
Chilli Warangal market
Chilli Warangal market

మిర్చి పంటను వేయాలంటేనే భయపడేవిదంగా తెగుళ్ళ సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి ఇదే క్రమంలో తెలంగాణ లో గత ఏడాది ఖమ్మంలో 35 వేలు పలికి రికార్డు సృష్టించగా ఈసారి దేశీయ రకం మిర్చి ఏకంగా రూ . 81 ,000 ధర పలికింది , అయితే ఇప్పుడు రైతులను నాణ్యత పేరుతో ధరలను తగ్గిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు .

సోమవారం వరంగల్ ఇనుమల తేజ రకం క్వింటాకు గరిష్టంగా రూ.23,200లు కనిష్టంగా రూ.16500లు, యూఎస్‌-341 గరిష్టంగా రూ.22,200లు కనిష్టంగా రూ.17,000లు, దేశీరకం రూ.80వేల నుంచి రూ.50 వేలు ధరలు పలికాయి. అదే మంగళవారం తేజ రూ.22,700-17,000లు, యూఎస్‌-341 రూ.21,300-16,500, దేశీరకం రూ.76 వేల నుంచి రూ.65 వేలు పలకడంతో ఒకే రోజులో రూ.4 వేలు తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


అంతర్జాతీయంగా భారీగా డిమాండ్ ఉన్న నాణ్యత పేరుతో రైతులను మోసం చేస్తున్నారు దళారులు , మరోవైపు ధరలు అధికంగా ఉన్నాయని ఒకేసారి రైతులు పంటను మార్కెట్టుకు తీసుకురావడంతో మార్కెట్టుకు మిర్చి రాక ఒకేసారి పెరిగింది దీనిని అదునుగా భావించి ఒకేసారి ధరలను తగ్గించేస్తున్నారు దళారులు .

ఈ ఏడాది తేజ రకం మిర్చికి రికార్డు ధర ..ఎంతనో తెలుసా !

ఈసారి వర్షాలకు తోడు నల్లనల్లి, తామరపురుగు దాడితో మిర్చి పంట దెబ్బ తిని దిగుబడి తగ్గింది. అయిన అధిక ధర లభిస్తుంది అని ఆశించిన రైతులకు మాత్రం నిరాశ ఎదురైనది .

ఈ ఏడాది తేజ రకం మిర్చికి రికార్డు ధర ..ఎంతనో తెలుసా !

Share your comments

Subscribe Magazine