News

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత అరుదైన ఖనిజం.. 'పుల్లరిన్'

Gokavarapu siva
Gokavarapu siva

వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మంగంపేటలో అత్యంత విలువైన 'పుల్లరిన్' అనే అరుదైన ఖనిజం ఉన్నట్లు శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైన్స్ అండ్ జియాలజీకి చెందిన ప్రొఫెసర్లు తెలిపారు. ఇప్పటి ప్రభుత్వం దీనికి ద్రుష్టి పెట్టి, ఈ పుల్లరిన్ ఖనిజాన్ని వెలికితీతకు ప్రయత్నిస్తుంది. ఈ పుల్లరిన్ ఖనిజం బెరైటీస్ నిల్వలో దాగి ఉన్నట్లు గుర్తించారు. ఈ పుల్లరిన్ ఖనిజం ద్వారా మనకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పుల్లరిన్ తో వివిధ రకాల రోగాలను నయం చేయడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ బెరైటీస్ నిల్వలో ఇంచుమించుగా 20 ఏళ్ల నుంచి ఈ పుల్లరిన్ ఖనిజం ఉన్నట్లు ప్రొఫెసార్లు తెలుపుతున్నారు. దీనికొరకు కేంద్రానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ పుల్లరిన్ ను వెలికితీయడం కష్టమని తెలిపారు. ఎందుకు అనగా 1000 కిలోల బైరటీస్ వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేస్తే ఒక కిలో పుల్లరిన్ దొరికే వీలు ఉంది అని తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన శ్రీధర్మూర్తి దీనిపై అధ్యయనం చేసారు. 1,050 నమూనాలను సేకరించి అమెరికాలోని వివిధ ప్రయోగశాలల్లో పరీక్షించడం ద్వారా నిక్షేపాల తీరుతెన్నులను గుర్తించారు. దీనిపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది.

ఇది కూడా చదవండి..

దేశంలో భారీగా లిథియం నిక్షేపాలు .. ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయా ?

ఇందులో బక్మినిస్టర్, బకీబాల్స్, నానో ట్యూబ్స్, మెగా ట్యూబ్స్ తదితర రకాలున్నాయి.దీని ప్రయోజనాలు శాసించే అంచనాలకు అందనంతగా ఉన్నాయి. భావితరాలను శాసించే నానో టెక్నాలజీలో ఫుల్లరిన్ అత్యంత కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పుల్లరిన్ ను స్పేస్ షటిల్స్ ఉరుములు, మెరుపులా నుండి కాపాడేందుకు వాటిపై పూతగా వాడతారు. ఇదికాకుండా దీనితో సోలార్ ఎనర్జీ, ఫార్మా, మరియు రక్షణ వ్యవస్థలో అనేక ఉపయోగాలు ఉన్నాయి.

ఫుల్లరిన్తో ఫార్మా రంగంలో లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. ఎయిడ్స్, క్యాన్సర్, పార్కిన్సన్, లుకేమియా, న్యూరోలాజికల్ రోగాల నుంచి ఉపశమనానికి, అల్ట్రా రేడియేషన్ వల్ల దెబ్బతిన్న చర్మ కణజాలం రక్షణకు ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పుల్లరిన్ అంతర్జాతీయ మార్కెట్లో ఒక గ్రాము 112 డాలర్ల ధర పలుకుతోంది. దీనితో ఇది అత్యంత విలువైనదిగా తెలుపుచున్నారు.

ఇది కూడా చదవండి..

దేశంలో భారీగా లిథియం నిక్షేపాలు .. ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయా ?

Related Topics

pularin ysr kadapa

Share your comments

Subscribe Magazine

More on News

More