News

దేశంలో భారీగా లిథియం నిక్షేపాలు .. ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయా ?

Gokavarapu siva
Gokavarapu siva

ఈ సాంకేతిక మరియు ఆధునిక యుగంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యత పెరుగుతూనేఉంది. ఈ అవసరాలకు అనుగుణంగా మనకిలభ్యమయ్యే సౌరశక్తిని వినియోగించుకోవాలని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఇక స్మార్ట్ ఫోన్ల సంగతికి వస్తే, ఫోన్ లేనిదే మన జీవితం గడవదు. ఈ అవసరాలు తీర్చుకోవడానికి మనకు లిథియం అనేది కావాలి. ప్రస్తుతం ఈ అత్యంత విలువైన ఈ ఖనిజాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసి వస్తుంది. ఇకపై ఆ అవసరం మనకి ఉండదు. అందుకు అనగ జమ్మూకాశ్మీర్ లోని రియాసీ జిల్లాలో మాతా వైష్ణోదేవి క్షేత్రం కొండల దిగువున సలాల్ హైమన గ్రామం వద్ద 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా గుర్తించింది. భారతదేశంలో తొలిసారిగా ఈ స్థాయిలో లిథియం నిల్వలు బయటపడ్డాయి.

ఈ లిథియంను తెల్ల బంగారంగా పిలుస్తున్నారు. లిథియం అనే పదం గ్రీక్ భాషలోని లిథోస్ (రాయి) అనే పదం నుంచి పుట్టింది. ఈ లిథియం అనేది ఆల్కలీ మెటల్ గ్రూపుకు చెందినది. తెల్లటి రంగులో, మృదువుగా ఉండే ఈ లోహంను పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 1 లో చేర్చారు. ఈ లిథియం అనేది అంతరిక్ష పేలుళ్ల వలన ఏర్పడింది అని గుర్తించారు. ఈ లిథియం అనేది ఇతర గ్రహాల పైన కూడా ఉంది.

ఈ లిథియం తవ్వకాలను చేయడం వలన పర్యావరణానికి చాల ముప్పు పొంచివుంది. ఈ లిథియం తవ్వకాలను జరపడం వలన కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుందని, ప్రకృతిపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. నీటి నిల్వలు అనేవి ఈ లిథుయిం తవ్వకాలు చేప్పట్టిన ప్రాంతాలలో అంతరించి పోతాయని హెచ్చరిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో తేమ తగ్గిపోయి, కరువు ప్రాంతాలుగా మారతాయన్నారు. ఒక టన్ను లిథియం తవ్వకాలు చేస్తే ఏకంగా 15 టన్నుల కార్బన్ దయాక్సిడ్ విడుదల అవుతుంది. దాదాపుగా ఒక తన్ను లిథియంను వెలికి తీయడానికి రూ.64 లక్షలు ఖర్చవుతుంది మరియు భారీగా నీరు కూడా అవసరం అవుతుంది.

ఇది కూడా చదవండి..

రుణమాఫీకి 6,385 కోట్లు కేటాయింపు .. 90 వేలలోపు రుణాలన్నీ మాఫీ

సాధారణంగా లిథియం నాణ్యత వచ్చేసి 220 పిపిఎం(పార్ట్స్ పర్ మిలియన్) ఉంటుంది. కానీ కాశ్మీర్లో కనుగొన్న లిథియం నాణ్యత ఏకంగా 500 పిపిఎంగా ఉండటం విశేషం. ఈ లిథియం అనేది విద్యుత్ వాహనాల బ్యాటరి తయారీలో కీలకంగా వినియోగిస్తారు. ఈ లిథియంని ఇతర లోహాలతో కలిపి మిశ్రమ లోహాలను తయారుచేస్తారు. సెల్ఫోన్లు, ల్యాప్ టాప్, కెమెరాలు, కంప్యూటర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాల బ్యాటరీలో ఈ లిథియంను ఉపయోగిస్తారు. వాటితోపాటు ఈ లిథియంను గాజు, సిరామిక్ పరిశ్రమలలో అధికంగా వాడతారు. పవన, సౌర విద్యుతను నిల్వచేసే బ్యాటరీలు లిథియంతో తయారవుతాయి. రీచార్జి చేయడానికి వీల్లేని బ్యాటరీల్లోనూ వాడుతారు. పేస్మేకర్లు, బొమ్మలు, గడియారాల్లోని బ్యాటరీల్లో లిథియం ఉంటుంది. అంతర్జాతీయంగా లిథియం మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2008 నుంచి 2018 నాటికి దీనికి వార్షిక ఉత్పత్తి 25,400 టన్నుల నుంచి 85,000 టన్నులకు చేరింది.

ఇది కూడా చదవండి..

రుణమాఫీకి 6,385 కోట్లు కేటాయింపు .. 90 వేలలోపు రుణాలన్నీ మాఫీ

Related Topics

lithium jammu and kashmir

Share your comments

Subscribe Magazine