News

లక్ష సాయం దరఖాస్తుల గడువు పెంచేది లేదు- మంత్రి గంగుల

Srikanth B
Srikanth B
లక్ష సాయం దరఖాస్తుల గడువు పెంచేది లేదు- మంత్రి గంగుల
లక్ష సాయం దరఖాస్తుల గడువు పెంచేది లేదు- మంత్రి గంగుల

తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుల వృత్తులు చేస్తున్న BCలకు , BC కళాకారులకు ఆర్థిక చేయూత అందించడానికి తీసుకొచ్చిన పథకం లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం గడువు నిన్నటి తో ముగిసింది . ముగిసిన తేదీ జూన్ 20 నాటికి 4. 5 లక్షలు దరఖాస్తులు వచ్చాయి , సర్వేర్ పనిచేయక ఇన్కమ్ సర్టిఫికెట్లు అందాకా చాలామంది లబ్ధిదారులు దరఖాస్తులు సమర్పించలేకపోయారు , చివరి గడువు పెంచాలని వచ్చిన డిమాండ్ పై స్పందించిన మంత్రి గంగుల దరఖాస్తు గడువు పెంచేది లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఈమేరకు స్పష్టం చేశారు.

అయితే ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. అర్హులై లబ్ధిదారులకు జూలై 15న ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. బీసీ రుణాల పంపిణీ నిరంతరం జరిగే ప్రక్రియ అని ఈ రుణాలకు దరఖాస్తులు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. విడతల వారీగా సహాయం అందిస్తామని, మరో విడత దరఖాస్తులకు మరో గడువు తేదీ ఉంటుందని వెల్లడించారు.

ఈసారి ముందుగానే రైతుబంధు .. స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?

ఏ BC కులాలవారు దీనికి అర్హులు :

నాయి బ్రాహ్మణ (మంగళి)
రజక (చాకలి )
సగర/ఉప్పర
కుమ్మరి /శాలివాహన
గోల్డ్ స్మిత్ (ఔసుల పని వారు )
కంసాలి
వడ్రంగి ,శిల్పులు
వడ్డెర
కమ్మరి
కంచరి
మేదర
కృష్ణ బలిజ
మేర (టైలేర్)
అరె కటిక
మరియి
ఏం బీసీ కులాలు

ఈసారి ముందుగానే రైతుబంధు .. స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?

Share your comments

Subscribe Magazine

More on News

More