News

ఈసారి ముందుగానే రైతుబంధు .. స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?

Srikanth B
Srikanth B
ఈసారి ముందుగానే రైతుబంధు .. స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?
ఈసారి ముందుగానే రైతుబంధు .. స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?

తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే ప్రభుత్వ పథకం రైతుబంధు .. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో యాసంగి పంట కొనుగోళ్లు పూర్తి కావడంతో రైతులు వానాకాలం సాగుకోసం సన్నదం అవుతున్నారు .

ఈ క్రమంలో రైతుబంధు అందింతే బాగుటుందని భావిస్తున్నారు . ప్రతి సంవత్సరం ప్రభుత్వం జూన్ చివరి వరం లేదా జులై మొదటి వారంలో రైతుబంధు ను విడుదల చేస్తుంది అయితే ఈ సంవత్సరం రైతుబంధు కొత్త దరఖాస్తు స్వీకారణ ,పోడు రైతులకు కూడా రైతుబంధు అందించనున్నది ,కాబ్బట్టి రైతుబంధు ఆలస్యంగా వస్తుందని అందరు భావించిన ప్రభుత్వం మాత్రం పాత రైతుబంధు లబ్దిదారులకు త్వరలోనే రైతుబంధు విడుదల చేస్తుందని సమాచారం అంతేకాకుండా కొన్ని రోజులలో దీనిపై అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం . రైతుబంధు వస్తే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

రైతు బంధును స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి..
1. ముందుగా https://treasury.telangana.gov.in/ link వెబ్ సైట్ కు వెళ్లాలి.
2. ఆ తర్వాత మెనూబార్ లో రైతు బందు స్కీమ్ వివరాల ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
3. ఆ తర్వత సంవత్సరం, భూమి రకం, పీపీబీ నంబర్ ఎంటర్ చేయాలి.
4. ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
5. ఆ తర్వాత డ్రాప్ డౌన్ జాబితా నుంచి స్కీమ్ వైజ్ రిపోర్ట్ క్లిక్ చేయాలి.
6. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.
7. అనంతరం సంవత్సరాన్ని ఎంచుకోవాలి.
8. పీపీబీ నంబర్ ఎంటర్ చేయాలి.
9. సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

లబ్ధిదారులకు అర్హత...
1. తెలంగాణ ప్రాంత నివాసి అయి ఉండాలి.
2. రైతు భూమి సొంతంగా కలిగి ఉండాలి.
3. రైతు చిన్న ప్రాంతానికి చెందినవారు కావాలి.
4. ఇది బిజినెస్ చేసే రైతులకు వర్తించదు.

సర్టిఫికేట్స్..
1. ఆధార్ కార్డు
2. ఓటరు ఐడి కార్డు.
3. పాన్ కార్డు
4. బీపీఎల్ సర్టిఫికేట్
5. భూ యాజమాన్య పత్రాలు
6. కుల ధృవీకరణ పత్రం.
7. చిరునామా ఫ్రూవ్
8. బ్యాంక్ అకౌంట్ వివరాలు..

హెల్ప్ లైన్ నంబర్..
సంప్రదించాల్సిన నంబర్.. 040 23383520
ఇమెయిల్ ఐడి.. omag-ts@nic.in

Related Topics

Raithu Bandu

Share your comments

Subscribe Magazine