కొత్త సంవత్సరం అనగానే హడావిడి మాములుగా ఉండదు .. కొందరు కొత్త సంవత్సరంలో ఎం చేయాలో న్యూ ఇయర్ రిసల్యూషన్ అంటూ అనేక శపధాలు తీసుకుంటారు, కొందరు మందు మానేయాలని , మరికొందరు ఆరోగ్యం ఆపై అధిక శ్రద్ధ పెట్టాలని జిమ్ లో జాయిన్ అవుతారు అయితే అందరు ఎంతో సరదాగా పాత సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటు నూతన సంవత్సరానికి ఆరంభం పలుకుతూ డిసెంబర్ 31 ను జరుపుకుంటారు , అయితే ప్రపంచం లో ఏ దేశం ముందుగా కొత్త సంవత్సరం సంబరాలను జరుపుకుంటుందో తెలుసా? ఆ వివరాలు మీకోసం ....
కొద్ది గంటల్లో 2023 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా నూతన ఏడాదికి ఘనంగా భారత్‌లో కంటే కొన్నిగంటల ముందే పలు దేశాల్లో ప్రజలు 2023 సంవత్సరంలోకి అడుగు పెడతారు. ముందుగా ఆస్ట్రేలియా దేశాలు అయినా ఆస్ట్రేలియా, మైక్రోనేషియా, ఫిజి, కిరిబాటి, మార్షల్ దీవులు, నౌరు, న్యూజిలాండ్, పాలూ, పాపువా న్యూ గినియా, సమోవా, సోలమన్ దీవులు, టోంగా, తువాలు మరియు వనాటు దేశాలు మొదటగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాయి .. ఇందులో ప్రపంచం లోనే మొట్ట మొదటిగా కిరిబాటి దేశం ప్రజలు డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలకే ప్రజలు 2023 సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
పామాయిల్ ధర పెరుగుదల.. రానున్న రోజులల్లో మరింత పెరిగే అవకాశం !
ఆసియా దేశాల్లో జపాన్, దక్షిణ కొరియాలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇక్కడ భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 31న రాత్రి 8.30 గంటలకు 2023 సంవత్సరానికి అక్కడి ప్రజలు స్వాగతం పలుకుతారు. అయితే, చివరిగా 2023 సంవత్సరానికి స్వాగతం పలికే దేశాల్లో అవుట్ లైయింగ్ ఐలాండ్ లో చివరిగా జరుపుకుంటారు. అంటే, భారత కాలమానం ప్రకారం.. జనవరి 1వ తేదీ సాయంత్రం 5.35 గంటలకు అక్కడ నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు.
Share your comments