రైతు సోదరులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సాగుచేస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి, సబ్సిడీ ఎరువులు పురుగుమందులు,వ్యవసాయ పరికరాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కోల్పోతే నష్టపరిహారం వంటి ప్రయోజనాలను తక్షణమే
రైతులు పొందడానికి ప్రభుత్వం ఈ-పంట యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు పొందాలంటే ఈ-పంట యాప్ లో తప్పనిసరిగా పేర్లు, పంట వివరాలు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత రైతులదే
రైతుల ప్రయోజనం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ పంట యాప్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది అంతేకా కాకుండా అన్ని పథకాలను యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ ఫారం కిందికి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సాగు చేసిన పంట రకం, విస్తీర్ణం, సర్వే నంబరు, ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం వివరాలతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ పంట యాప్ ద్వారా ఆర్బీకే పరిధిలోని భూమిని ఇప్పటికే జియో ఫెన్సింగ్ చేసుకుని ఉన్నందున రైతు నమోదు చేసుకోగానే రైతులు సాగు చేసిన పంట వివరాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. తద్వారా డిజిటల్ సర్టిఫికెట్ రైతు ఫోన్‌కు సమాచారం చేరుతుంది. ఇప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేసే పంట బీమా, మద్దతు ధర, సున్నా వడ్డీ రుణాలు వంటి పథకాలన్నీ నూతనంగా అమల్లోకి వచ్చిన ఈ పంట యాప్ ద్వారానే అమలు చేస్తారు.
Share your comments