మధ్య దళారుల ప్రమేయం లేకుండా సేంద్రియ రైతుల నుంచి 12 రకాల ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయాలని TTD నిర్ణయించింది . దీని ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన సేంద్రియ రసాయనాలను వినియోగించని ప్రసాదాలను అందించనున్నారు .
మారిన కాలంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలలో చాల మార్పులు వచ్చాయి , పెరిగిన జనాభాకు సరిపడా ఆహారం రసాయన వినియోగం లేకుండా అందించడం అసాధ్యం గ మారింది దీనితో ఏమైనప్పటికి తిరుపతి కి వచ్చే భక్తులకు ఆర్గానిక్ ఆహారాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించుకుంది ఈమేరకు ఇప్పటికే సేంద్రియ పద్ధతిలో లో వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తులను కొనుకోలు చేయడం ప్రారంభించింది , దీనితో ఇకపై తిరుమల దేవస్థానం లో భక్తులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించనున్నది .
అయితే తిరుపతి తిరుమల ఆలయంలో ప్రజలకు అందించే భోజనం సహజసిద్ధంగా ఉండాలని దేవస్థానం నిర్ణయించింది. దీని ప్రకారం సేంద్రియ రైతుల నుంచి 12 రకాల ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
తిరుపతి దేవస్థానంలో రాష్ట్ర రైతు కమిషన్, మార్క్‌ఫెడ్ అధికారులు సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపులలో, 12 రకాల ఆహార పదార్థాలను ప్రసాదంగా కొనుగోలు చేసి, బహుళ విడతలుగా ప్రజలకు పంపిణీ చేయడానికి ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం మరియు మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కూడా కుదిరింది.
ఈ ఒప్పందం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ప్రసాదం అందించేందుకు ఉపయోగపడే 12 రకాల ఆహార పదార్థాలను దళారుల ప్రమేయం లేకుండా సేంద్రియ రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించాం.
తెలంగాణా లోని ఈ గ్రామం చిలక జోశ్యం చెప్పే వారికీ ప్రసిద్ధి!
గుడ్ న్యూస్.. ఈరోజు నుంచి రైతు బందు డబ్బుల పంపిణి ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో, రాష్ట్ర రైతు అథారిటీతో 11 అక్టోబర్ 2021న ఎంఓయూ కుదిరింది. అనంతరం మొదటి విడతగా 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేశారు. అందులో ఎలాంటి రసాయనాలు వాడడం లేదని నిర్ధారించుకున్న తర్వాత మూడో విడతలో వేరుశనగ, పప్పు, బియ్యం, బెల్లం, శనగ, , కొత్తిమీర, ధనియాలు , చింతపండు, కొన్నిరకాల పండ్లు , మిరియాలు, పసుపు తదితరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు రసాయన రహిత ప్రసాదాలు అందజేస్తామని తెలిపారు.
Share your comments