News

తెలంగాణా లోని ఈ గ్రామం చిలక జోశ్యం చెప్పే వారికీ ప్రసిద్ధి!

Srikanth B
Srikanth B

తెలంగాణలోని ఒక గ్రామం  చిలక జోశ్యం చెప్పేవారికి  ప్రసిద్ధి చెందింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని బుడిగ జంగాల కాలనీలో నివాసముంటున్న 200 మంది పైగా చిలక జోశ్యం వృతిపైనే ఆధారపడి  జీవనం సాగిస్తున్నారు .

వారు శిక్షణ పొందిన చిలుకల ద్వారా ప్రజల భవిష్యత్తును తెలియజేస్తారు. గ్రామస్థులకు జీవనాధారంగా మారడంతో జాతకం చెప్పే వృత్తిని వారి జీవనోపాధి గ తీసుకున్నారు. వారు కార్డులు తీయడంలో పక్షులకు శిక్షణ ఇస్తారు. కస్టమర్లు అడిగే ప్రశ్నలను పారాకీట్‌లకు అర్థమయ్యేలా చేస్తాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్కో జాతకుడు సగటున రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తున్నాడు.

ప్రపంచం లోనే అతిపెద్ద మంచి నీటి చేప.. దాని బరువు ఎంతో తెలుసా ?

వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు సహా అన్ని వర్గాల ప్రజలు తమ వద్దకు వస్తారని జాతకులు తెలిపారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి వస్తుంటారనిని , ఈ కల అంతరించి పోకుండా భావితరాలకు కూడా ఈ  కళను నేర్పిస్తామని ఒక జ్యోతిష్యుడు తెలిపాడు.

అగ్నిపథ్ స్కీమ్ :అగ్నివీర్లకు 'గ్యారంటీడ్' ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించిన హర్యానా CM

Share your comments

Subscribe Magazine