తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో మాస్క్‌ను తప్పనిసరి చేసింది.శ్రీవారి దర్శనానికి కొత్త సంవత్సరం రోజు అధిక మొత్తం లో భక్తులు వచ్చే అవకాశము ఉండడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ బోర్డు వెల్లడించింది , దూర ప్రాంతాల నుంచి భక్తులు తప్పని సరిగా టీటీడీ సూచించిన మార్గదర్శకాలను పాటించాలని , కరోనా వ్యాప్తి దృష్ఠ్య అందర సహకరించాలని భక్తులను సూచించింది . అలాగే, డిసెంబరు 31, జనవరి 1న సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసినట్టు తెలిపారు. జనవరి 2, 3 తేదీల్లో సిఫారసు లేఖలు కూడా స్వీకరించమని చెప్పారు.
ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చన్నారు. జనవరి 2 నుంచి 11 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, రోజుకు వెయ్యి మంది చొప్పున 10 రోజుల పాటు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఈ నెల 29 నుంచి జనవరి 3 వరకు అడ్వాన్స్డ్ విధానంలో వసతిగదుల కేటాయింపు కూడా రద్దు చేసినట్లు TTD వెల్లడించింది .
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటలు, సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 70,496 మంది భక్తులు దర్శించుకోగా 25 వేల మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా టీటీడీ 5.88 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు.
Share your comments