Tomato Flu Alert :: చిన్నారుల్లో టొమాటో జ్వరం లేదా ఫ్లూ వ్యాపించడంతో కేరళ సరిహద్దులోని చెక్‌పోస్టులన్నింటిపై తమిళనాడు ఆరోగ్య శాఖ నిఘా పెంచింది.
ఐదేళ్లలోపు పిల్లలను స్కాన్ చేయడానికి ఆరోగ్య, పోలీసు మరియు రెవెన్యూ అధికారులు పాలక్కాడ్ జిల్లా నుండి వాలాయర్ చెక్-పోస్టు, తిరువనంతపురం నుండి కల్లియకావలి మరియు తేని చెక్ పోస్ట్‌ల వద్ద తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసారు .
తమిళనాడు ఆరోగ్య శాఖకు చెందిన సీనియర్ అధికారి మీడియా తో మాట్లాడుతూ : “టమోటో ఫ్లూ లేదా జ్వరం స్వీయ-పరిమితం మరియు దీనికి నిర్దిష్ట మందులు లేవు మరియు ఎవరైనా ఈ వ్యాధితో ప్రభావితమైతే వారిని ఒంటరిగా ఉంచాలి. ఇది ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపించే అంటూ వ్యాధి అని అయన వెల్లడించారు .
టొమాటో ఫ్లూ లక్షణాలు : ఒంటి పై దద్దుర్లు మరియు పొక్కులు ఎరుపు రంగులో వస్తాయి . ఈ ఫ్లూ బారిన పడిన ఐదేళ్లలోపు పిల్లలకు శరీరంపై బొబ్బలు, దద్దుర్లు రావడంతో పాటు జ్వరం, శరీర నొప్పి ఎక్కువగా ఉంటాయి.
దద్దుర్లు, పొక్కులు ఉన్న పిల్లలు రాష్ట్రంలోకి రాకుండా ప్రతి చెక్‌పోస్టు వద్ద మూడు బృందాలను నియమించినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.
PM Kisan Shocking News: 3 లక్షల PM కిసాన్ అనర్హులైన రైతులను గుర్తించిన ప్రభుత్వం !
వ్యాధి సోకిన పిల్లలకు డీహైడ్రేషన్, కడుపు నొప్పి, విరేచనాలు మరియు వికారం మరియు వాంతులు వంటి లక్షణాలు కూడా ఉంటాయి.కేరళలోని పలు జిల్లాల్లో చిన్నారులు టొమాటో ఫ్లూ బారిన పడుతున్నారని, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Share your comments