ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బ తినడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు స్టాక్ మార్కెట్ దరల ఎగబాకుతున్నాయి.
మనం నిత్యం వంటల్లో వాడే టమాటా ధరకి రెక్కలొచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఒక కిలో టమాటా ధర రూ.10 ఉన్నది కానీ ప్రస్తుతం టమాటా ధర కిలో రూ.80కి ఎగబాకింది.దాదాపు నెల క్రితం టమాటా ధరలు విపరీతంగా పడిపోవడాన్ని నిరసిస్తూ రైతులు కూరగాయలను రోడ్డుపై పడేస్తున్న దృశ్యాలు మనం చూసాం. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది,అధిక దారాలతో రైతులు సంబరాలు చేసుకుంటుండగా మధ్య, పేద తరగతి వర్గాలకు మాత్రం కష్టతరంగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా టమాట ఉత్పత్తి తగ్గింది. సాధారణం కంటే ఎండలు అధికంగా ఉండటంతో పూత రాక పంట తగ్గింది. దీనికి తోడుగా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు,ఈదురు గాలులకు టమాట పంటకు విపరీతమైన నష్టం వాటిల్లింది.తుపాను ప్రభావంతో రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ టమాటా పంటకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తుపానుతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పంటకు నష్టం వాటిల్లింది.
అధికారిక ధరల జాబితాలో టమటా ధర రూ.80గా చూపినప్పటికీ, పలు ప్రాంతాల్లో కిలో ధర రూ.100 దాటింది.టమాటా ధరని భరించలేని పేద,మధ్య తరగతి వర్గాలు దీనికి బదులుగా చింతపండుని వాడుతున్నారు.
కూరగాయల ధరల పెంపు అనేది ప్రతి సంవత్సరం వేసవి చివరిలో సర్వ సాధారణం అయినప్పటికీ , ఈ సంవత్సరం ధరల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి టమటా ధర భారీగానే పెరిగింది. ఒక వైపు మంచి ధరలు రావడం తో టమాటా రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరొక వైపు పెరిగిన ఈ ధరలు సామాన్యుడికి భారంగా మారిపోయాయి.
మరిన్ని చదవండి.
Share your comments