పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి .. ఒక వైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలు మరోవైపు పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్యు ప్రజలు కొనలేని విధంగా పెరిగిపోతున్నాయి టమాటో అయితే ఏకంగా కిలో చికన్ ధరతో పోటీపడుతోంది రానున్న రోజులలో కిలో టమాటో 300 రూపాయలకు చేరుకున్న ఆశ్చర్యపొన్నకర్లేదు .
తెలుగు రాష్ట్రాలలో 120 నుంచి 150 వరకు పలుకుతున్న కిలో టమాటో ధర నేడు ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో గంగ్రోత్రి ధామ్ లో కిలో టమాటా రూ.250 పలికింది.
హైదరాబాద్ లో కిలో టమాటా రూ.90 నుంచి రూ130 వరకు పలుకుతోంది. బెంగళూరులో కిలో టమాటా రూ.101 నుంచి రూ.130 పలుకుతుండగా.. కోల్ కత్తాలో రూ.150, ఢిల్లీలో రూ.120, ముంబైలో రూ.120 పలుకుతున్నాయి. టమాటా ధరలు భారీగా పెరగడంతో రెస్టారెంట్ లు టమాటా వినియోగాన్ని తగ్గిస్తున్నాయి .
జులై 10 నుంచి రైతుభీమా కొత్త దరఖాస్తుల స్వీకరణ ..
కొన్ని హోటళ్లలో అయితే టమాటో వాడకాన్ని కూడా తగ్గించుకున్నాయి , కొన్ని చోట్ల టొరంటో చోరీలు కూడా జరుగుతున్నాయి మొన్నటికి మొన్న కర్నాటక రాష్ట్రం గోని సోమనహళ్లిలో నివాసముంటున్న ధరణి అనే రైతు విషయానికొస్తే.. పంట చేతికి వస్తుందనే ఆశతో తన భూమిలో టమోటా పంటను వేశాడు. అతని ఆనందానికి తగట్టు, పంట ఊహించిన దాని కంటే బాగా పండింది. విస్తారంగా పండిన పంటను వారం రోజుల్లోనే మార్కెట్‌కి విక్రయించాలని ఆ రైతు భావించాడు. కానీ ఇంతలోనే అతని టమోటా పంటను మొత్తం దొంగలు దోచుకుపోయారు.
Share your comments